Synthetic Embryo: ప్రపంచ వైద్య చరిత్రలోనే తొలిసారి.. అండాలు, శుక్రకణాలు లేకుండా... మూలకణాలతో కృత్రిమ గర్భస్థ పిండం
ఈ పిండంలో మానవ పిండం మాదిరిగా అవయవాలన్ని క్రమంగా అభివృద్ధి చెందుతాయని వాళ్ళు చెబుతున్నారు.
London, August 29: ప్రపంచంలోనే తొలిసారిగా కృత్రిమ గర్భస్థ పిండాన్ని (Synthetic embryo) శాస్త్రవేత్తలు సృష్టించారు. ఈ పిండంలో మానవ పిండం (Embryo) మాదిరిగా అవయవాలన్ని (Limbs) క్రమంగా అభివృద్ధి చెందుతాయని వాళ్ళు చెబుతున్నారు. స్త్రీలోని (Women) అండాలు, పురుషుడిలోని (Men) స్పెర్మ్ (Sperm)ని ఉపయోగించి కృత్రిమంగా పిండాన్ని ప్రయోగశాలల్లో రూపొందిస్తారన్న విషయం తెలిసిందే. దీన్నే టెస్ట్ ట్యూబ్ బేబి అంటారు. కానీ ఇక్కడ మాత్రం శాస్త్రవేత్తలు వాటిని వినియోగించకుండా కేవలం స్టెమ్ సెల్స్(మూల కణాలను) వినియోగించి కృత్రిమ గర్భస్థ పిండాన్ని రూపొందించారు.
ఎవరు ప్రయోగాలు చేశారు?
కేం బ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు
ఎలా చేశారు?
వేర్వేరు రకాలకు చెందిన మూడు మూలకణాల్లోని జన్యువులను పరస్పరం చర్య జరుపుకునేలా ప్రత్యేక వాతావరణాన్ని శాస్త్రవేత్తలు క్రియేట్ చేశారు. అలా కృత్రిమ గర్భస్థ పిండాన్ని రూపొందించారు. మానవుల సాధారణ గర్భస్థ పిండంలో గుండె కొట్టుకోవడం, మెదడు, చర్మం వంటివి ఎలా అభివృద్ధి చెందుతాయో అలా ఈ కృత్రిమ గర్భస్థ పిండంలోనూ జరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఉపయోగం ఏమిటి?
ఈ పరిశోధన కొంతమంది తల్లులకు గర్భం విజయవంతమవ్వడం, మరికొందరికి గర్భస్రావం అవ్వడంవంటివి ఎందుకు జరుగుతాయో తెలుసుకునేందుకు దోహదపడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.