Trains cancelled: విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో 11వ తేదీ వరకు పలు రైళ్ల రద్దు.. నిజమాబాద్నుంచి వెళ్లే మరో మూడు సర్వీసులు కూడా క్యాన్సల్
విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో నిర్వహణ పనుల నిమిత్తం పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
Hyderabad, Sep 4: విజయవాడ రైల్వే డివిజన్ (Vijayawada Railway Division) పరిధిలో నిర్వహణ పనుల నిమిత్తం పలు రైళ్లను (Trains) రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రద్దైన రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు-విశాఖపట్నం (17239) సింహాద్రి ఎక్స్ ప్రెస్, విశాఖపట్నం-మచిలీపట్నం (17220) రైలును సెప్టెంబరు 5 నుంచి 10వ తేదీ వరకు, విశాఖపట్నం-గుంటూరు (17240) రైలును 6 నుంచి 11 వరకు, విశాఖపట్నం-విజయవాడ (22701), విజయవాడ-విశాఖపట్నం (22702) ఉదయ్ ఎక్స్ ప్రెస్‌ను 5, 6, 8, 9 తేదీల్లో రద్దుచేశారు. గుంటూరు-రాయగడ ఎక్స్ ప్రెస్ (17243), మచిలీపట్నం-విశాఖపట్నం (17219), విశాఖపట్నం-లింగంపల్లి (12805) జన్మభూమి ఎక్స్ ప్రెస్‌లను ఈ నెల 9 వరకు, లింగంపల్లి-విశాఖపట్నం (12806) జన్మభూమి ఎక్స్ ప్రెస్, రాయగడ-గుంటూరు (17244), విజయవాడ-విశాఖపట్నం (12718), విశాఖపట్నం-విజయవాడ (12717) రత్నాచల్ లను 10 వరకు రద్దుచేసినట్లు తెలిపారు. తిరుపతి-విశాఖపట్నం (22708) డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్ 6, 8 తేదీల్లో సామర్లకోట వరకే నడుస్తుందని, విశాఖలో బయల్దేరాల్సిన విశాఖపట్నం-తిరుపతి (22707) రైలు 7, 9 తేదీల్లో సామర్లకోట స్టేషన్ నుంచి బయలుదేరుతుందని ప్రకటనలో పేర్కొన్నారు.
నిజామాబాద్ నుంచి..
నేటి నుంచి ఈనెల 10వ తేదీ వరకు నిజామాబాద్ జిల్లా మీదుగా రాకపోకలు సాగించే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. హైదరాబాద్- సికింద్రాబాద్ మార్గంలో నిర్వహణ పనుల కారణంగా నిజమాబాద్- కరీంనగర్, కరీంనగర్- నిజమాబాద్, నిజామాబాద్ నుంచి పండరీపూర్ వెళ్లే రైళ్లను రద్దు చేస్తున్నట్టు వెల్లడించారు.