Representational Image (File Photo)

Hyderabad, Sep 4: నిరుద్యోగులకు (Un Employees) ఉద్యోగం (Job) పేరిట వల వేయడం.. ట్రైనింగ్ (Training) పేరిట లక్షల్లో సొమ్ము గుంజేయడం.. అనంతరం డబ్బుతో ఉడాయించడం.. నేరస్తుల పంథా మారట్లేదు. ఉద్యోగులను మోసం చేసి హైదరాబాద్ (Hyderabad) లోని  హైటెక్‌ సిటీలో ఉన్న ఓ సాఫ్ట్‌ వేర్‌ కంపెనీ బోర్డు తిప్పేసింది. శిక్షణతో పాటు ఉద్యోగం ఇస్తామని నిరుద్యోగుల నుంచి రూ. 3 కోట్లు గుంజిన సదరు సంస్థ నిర్వాహకులు చేతులెత్తేశారు.

Telugu Bigg Boss 7: తెలుగు బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్లు ఫుల్ లిస్ట్ ఇదే! హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన షకీలా, శివాజీతో పాటూ సోషల్ మీడియా స్టార్స్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో 24 గంటలు స్ట్రీమ్ కానున్న బిగ్‌ బాస్‌ 7

అసలేం జరిగిందంటే??

మాదాపూర్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌ లోని కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రాంతానికి చెందిన బిజినేపల్లి ప్రేమ్‌ ప్రకాష్‌ (44) నగరానికి వలస వచ్చాడు. సనత్‌ నగర్‌ లో నివాసం ఉంటూ స్నేహితుడు లిఖిత్‌ తో కలసి ఏడాది క్రితం కొండాపూర్‌ లో ‘సంటూ సూ ఇన్నోవేషన్స్‌’ పేరిట ఐటీ కంపెనీ ప్రారంభించాడు. తమ కంపెనీలో శిక్షణ అనంతరం ఉద్యోగం కల్పిస్తామని ఒక్కో నిరుద్యోగి వద్ద రూ.లక్ష నుంచి లక్షన్నర వసూలు చేశారు. అలా సొమ్ము చెల్లించి కంపెనీలో చేరిన వారికి రెండు నెలలు జీతాలు ఇచ్చారు. ఆ తర్వాత మాయమాటలు చెబుతూ కాలం గడుపుతున్నారు. కంపెనీ నిర్వాహకుల నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఉద్యోగులు ఆదివారం పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు నిందితులు ప్రేమప్రకాష్‌, లిఖిత్‌ లను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. నిందితులు దాదాపు రూ.3కోట్లు వసూలు చేసి మోసానికి పాల్పడినట్లు తెలిపారు.

One Nation One Election: జమిలి ఎన్నికల నిర్వహణకు ఖర్చు రూ. 9300 కోట్లు అవుతుందని అంచనా