Telugu Bigg Boss 7: తెలుగు బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్లు ఫుల్ లిస్ట్ ఇదే! హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన షకీలా, శివాజీతో పాటూ సోషల్ మీడియా స్టార్స్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో 24 గంటలు స్ట్రీమ్ కానున్న బిగ్‌ బాస్‌ 7
Telugu Bigg Boss 7 (PIC @ Star Maa)

Hyderabad, AUG 03: తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్ సీజన్ 7 కోసం ఎదురు చూస్తున్న అభిమానుల ఎదురు చూపులకు తెర పడింది. సెప్టెంబర్ 3 ఆదివారం నాడు ఈ సీజన్ గ్రాండ్ గా మొదలైంది. ఈసారి కూడా నాగార్జునే (Nagarjuna) బిగ్ బాస్ హోస్ట్ కనిపించబోతున్నాడు. ఇక రేపట్నుంచి సోమవారం టు శుక్రవారం.. రాత్రి 9.30 గంటలకు బిగ్‌బాస్ షో (Star Maa) ఛానల్ లో ఎంటర్టైన్ చేయనుంది. అలాగే డిస్నిప్లస్ హాట్ స్టార్ (Disney Plus Hotstar) లో 24 గంటలు లైవ్ తో స్ట్రీమ్ కానుంది. కాగా ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ గా ఎవరు కనిపించబోతున్నారు అని అందరిలో ఆసక్తి నెలకొంది. ఇప్పటి వరకు చాలా పేర్లు వినిపించాయి. ఆ సెలబ్రిటీ లోపాలకి వెళ్లబోతున్నాడు, ఈ స్టార్ కంటెస్టెంట్ గా రాబోతున్నాడని. తాజాగా రియల్ కంటెస్టెంట్స్ ఆడియన్స్ ముందుకు వచ్చేశారు.

 

1) ప్రియాంక జైన్

తొలి కంటెస్టెంట్‪‌గా సీరియల్ యాక్ట్రెస్ ప్రియాంక జైన్ ఎంట్రీ ఇచ్చింది. 2015 లో తమిళ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ఆ తరువాత ఏడాది కన్నడలో ఒక చిత్రం, 2018 లో టాలీవుడ్ లో ఒక మూవీ చేసింది. అయితే సినిమాల్లో పెద్దగా అదృష్టం కలిసి రాకపోవడంతో బుల్లితెరకు షిఫ్ట్ అయ్యింది. అక్కడ అమ్మడి దశ తిరిగింది. సీరియల్స్ తో తెలుగు నాట మంచి గుర్తింపుని సంపాదించుకుంది.

 

2) శివాజీ

రెండో కంటెస్టెంట్ గా టాలీవుడ్ హీరో శివాజీ ఎంట్రీ ఇచ్చాడు. టీవీ ఛానల్ లో పని చేసే స్థాయి నుంచి హీరోగా వరుస సినిమాలు చేసే స్థాయి వరకు చేరుకున్నాడు. కొంతకాలం హీరోగా వరుస సినిమాలు చేసి బిజీ లైఫ్ ని గడిపిన శివాజీ ఆ తరువాత ఛాన్స్ లు తగ్గడంతో స్క్రీన్ పై కనిపించడం తగ్గించాడు. అయితే సినిమా రంగంలో తన ఉనికి తగ్గించిన.. రాజకీయం రంగంలో తన గొంతుని వినిపిస్తూ ప్రేక్షకులకు కనిపిస్తూ వచ్చాడు.

 

3) దామిని

ఇక మూడో కంటెస్టెంట్ గా సింగర్ దామిని బిగ్‌బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. పాడుతా తీయగా సింగింగ్ ప్రోగ్రామ్ తో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న దామిని.. బాహుబలి సినిమాలో ‘పచ్చబొట్టేసిన’ సాంగ్ పాడి వరల్డ్ వైడ్ గా గుర్తింపుని సంపాదించుకుంది. అలాగే టాలీవుడ్ లో పలు సూపర్ హిట్ సినిమాల్లో పాటలు పడుతూ సంగీత ప్రియులను తన గాత్రంతో అలరిస్తూ వస్తుంది.

 

4) ప్రిన్స్ యావర్

హౌస్ లోకి నాలుగో కంటెస్టెంట్‌గా ‘ప్రిన్స్ యావర్’ ప్రవేశించాడు. మోడల్ అయిన ప్రిన్స్.. మోడలింగ్‌ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్నాడు. తెలుగు వారికి ఇతను పెద్దగా పరిచయం లేని వ్యక్తి అనే చెప్పాలి. అంతేకాదు తెలుగు కూడా అలా అలా మాట్లాడుతుంటాడు. మరి హౌస్ లో తన పర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ ని ఏమాత్రం ఆకర్షిస్తాడో చూడాలి.

5) శుభశ్రీ

నటి శుభశ్రీ హౌస్ లోకి ఐదో కంటెస్టెంట్‌గా ఇచ్చింది. ఈమె యాక్టర్ మాత్రమే కాదు ప్రొఫెషనల్ లాయర్ కూడా. ఒడిశా అమ్మాయి అయిన శుభశ్రీ ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉంటుంది. ఈమె కూడా తెలుగు అంతగా రాదు.

6) షకీలా

ఇక ఆరో కంటెస్టెంట్‌గా మనందరికీ తెలిసిన షకీలా ఎంట్రీ ఇచ్చింది. 18 ఏళ్లకే నటనా జీవితం మొదలు పెట్టిన షకీలా.. బోల్డ్ క్యారెక్టర్లతో సౌత్ ఒక వెలుగు వెలిగింది. మలయాళ సినిమాల్లో ఎక్కువ నటించిన షకీలా తెలుగు, తమిళ, కన్నడ ఆడియన్స్ ని కూడా పలు చిత్రాలతో అలరించింది. కాగా ఈమె బిగ్‌బాస్ షోలో పాల్గొనడం ఇది రెండోసారి. గతంలో కన్నడ బిగ్‌బాస్ షోలో కంటెస్టెంట్ గా కనిపించినా టైటిల్ ని అందుకోలేక పోయింది. మరి ఈసారి ఏమి చేస్తుందో చూడాలి.

 

7) ఆట సందీప్

ముందు నుంచి వినిపిస్తునట్లే ఈ సీజన్ 7 లోకి ఆట సందీప్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. టాలీవుడ్ ఈ పేరు ఎక్కువుగా వినిపిస్తూనే ఉంటుంది. ప్రముఖ తెలుగు డ్యాన్స్‌ షో ‘ఆట’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న సందీప్.. ఆ షో పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో డ్యాన్సర్‌గా, కొరియోగ్రాఫర్‌గా రాణిస్తూ వస్తున్నాడు. ఎక్కువుగా చిరంజీవి డాన్స్ వీడియోలతో సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ నే సంపాదించుకున్నాడు.

8) శోభాశెట్టి

బిగ్ బాస్ హౌస్ లోకి ఎనిమిదో కంటెస్టెంట్‌గా తెలుగు బుల్లితెర ఫేమస్ విలన్ శోభాశెట్టి ఎంట్రీ ఇచ్చింది. అదేనండి మన కార్తీకదీపం సీరియల్ లో డాక్టర్ బాబుని దక్కించుకునేందుకు ఎన్నో కుట్రలు చేసి వంటలక్కని ఎన్నో ఇబ్బందులు పెట్టిన మోనితనే ఈ శోభాషెట్టి. కర్ణాటకలోని ఒక చిన్న సాధారణ కుటుంబంలో పుట్టిన శోభాశెట్టి.. ఎన్నో కష్టాలు ఎదుర్కొని నేడు తెలుగులో ఇంతటి ఫేమ్ ని సంపాదించుకుంది. ఇప్పటి వరకు మోనితగా అందరి మనసుని బాధపెట్టిన శోభాశెట్టి.. బిగ్ బాస్ తో అందరి మనసు దోచుకుంటుందేమో చూడాలి.

9) టేస్టీ తేజ

యూట్యూబ్‌లో ఫుడ్ వ్లాగర్ మంచి గుర్తింపు తెచ్చుకున్న టేస్టీ తేజ తొమ్మిదో కంటెస్టెంట్‌గా హౌస్ లోకి అడుగు పెట్టాడు. టాలీవుడ్ లోని పలు సినిమా ప్రమోషన్స్ కోసం కూడా మనోడిని ఉపయోగించుకుంటారు. అంత ఫేమస్ ఈ టేస్టీ తేజ. సెలబ్రిటీస్ తో కలిసి భోజనం చేస్తూనే మూవీ ప్రమోషన్స్ చేయడంలో తేజ స్పెషలిస్ట్. ఈసారి హౌస్ లో ఇతని నుంచి మంచి కామెడీ ఆశించవచ్చు.

10) రతిక రోజ్

తెలుగమ్మాయి అయిన రతిక రోజ్.. హౌస్ లోకి పదో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. మోడలింగ్‌ రంగంలో కెరీర్ స్టార్ట్ చేసిన రతిక.. యాక్టింగ్ పై ఇంటరెస్ట్ తో సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే పలు సినిమాల్లో నటించిన పెద్దగా గుర్తింపు రాలేదు. ఇప్పుడు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మరి ఈ అమ్మడి దశ బిగ్ బాస్ చేంజ్ చేస్తాడో లేదో చూడాలి.

11) గౌతమ్

పదకొండో కంటెస్టెంట్‌గా యాక్టర్ కమ్ డాక్టర్ గౌతమ్ కృష్ణ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. చిన్ననాటి నుంచే డైరెక్షన్, రైటింగ్స్ పై ఆసక్తి ఉన్నా.. పేరెంట్స్ కోరిక మేరకు డాక్టర్ అయ్యాడు. అయితే సినిమా ఇండస్ట్రీ పై మమకారం అలానే ఉండడంతో ‘ఆకాశవీధుల్లో’ అనే సినిమాలో హీరోగా నటించే అవకాశం తెచ్చిపెట్టింది. ఇప్పుడు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.

12) కిరణ్ రాథోడ్

పన్నెండో కంటెస్టెంట్‌గా యాక్ట్రెస్ కిరణ్ రాథోడ్ ఎంట్రీ ఇచ్చింది. హిందీ సినిమాతో తెరగేంట్రం చేసిన ఈ భామ.. తెలుగు, తమిళ, కన్నడ మలయాళ భాషల్లో పలు సినిమాల్లో నటించింది. కొంతకాలంగా వెండితెర పై కనిపించని ఈ భామ.. తమిళంలో తెరకెక్కుతున్న విజయ్ ‘లియో’ మూవీలో నటిస్తూ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇప్పుడు సడన్ గా బిగ్ బాస్ లో కనిపించింది.

13) పల్లవి ప్రశాంత్

బిగ్‌బాస్‌కు వెళ్ళాలి అనేదే తన కల అని ఎప్పుడు చెబుతూ ఉండే యూట్యూబర్ యువరైతు పల్లవి ప్రశాంత్.. ఎట్టకేలకు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. వ్యవసాయాన్ని వదిలేస్తున్న రోజుల్లో దానినే తన జీవితంగా భావించి కష్టమొచ్చినా, నష్టమొచ్చినా వ్యవసాయానే నమ్ముకొని ఉంటాను అని చెప్పి, తన చేసే ప్రతి పనిని యూట్యూబ్ లో షేర్ చేస్తూ ఫేమస్ అయిన పల్లవి ప్రశాంత్.. ఎప్పటికైనా బిగ్ బాస్ కి వెళ్తాను అంటూ ప్రతిసారి చెప్పుకొచ్చేవాడు. ఇక ఈ మాటలు బిగ్ బాస్ దృష్టిలో పడడంతో ఇప్పుడు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేశాడు.

14) అమర్‌ దీప్

ఇక పద్నాలుగో కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌసులోకి సీరియల్ యాక్టర్ అమర్ దీప్ ఎంట్రీ ఇచ్చాడు. తెలుగు అబ్బాయి అయిన అమర్‌దీప్ విదేశాల్లో చదువుకున్నప్పటికీ సినిమాల పై ఆసక్తి ఉండడంతో ఇండస్ట్రీ వైపు అడుగులు వేసేలా చేసింది. ఒక చిన్న షార్ట్ ఫిలింతో ఫేమ్ ని సంపాదించుకున్న అమర్.. తరువాత సినిమాలు, సీరియల్స్ తో తెలుగులో మంచి ఫేమ్ ని సంపాదించుకున్నాడు. మరి టీవీ సీరియల్స్ తో సంపాదించుకున్న ఫాలోయింగ్.. బిగ్ బాస్ కి ఉపయోగపడుతుందా అనేది చూడాలి.