Soaring Temperatures: అత్యవసరమైతేనే బయటకు రండి, పగలు బయటకు రావద్దని హెచ్చరించిన వాతావరణ శాఖ, తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగలు

రెండు రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత రెండు మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. సాధారణం కంటే 2-3 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం (ఐఎండీ) ప్రకటించింది.

Heatstroke (Representational Image; Photo Credit: Pixabay)

తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగమంటున్నాడు. రెండు రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత రెండు మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. సాధారణం కంటే 2-3 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం (ఐఎండీ) ప్రకటించింది.

కొన్ని జిల్లాల్లో 44-45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు చేరాయి. ఉత్తర, ఈశాన్య, తూర్పు తెలంగాణ జిల్లాల్లో 40 డిగ్రీలకు పైన, మిగిలిన జిల్లాల్లో సాధారణం కంటే ఒకటి రెండు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ నాగరత్న తెలిపారు. వాయువ్య భారతం నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో వడగాల్పులు వీస్తున్నాయి.

నిప్పుల కొలిమిలో తెలుగు రాష్ట్రాలు, రాజమండ్రిలో అత్యధికంగా 49 డిగ్రీల ఉష్ణోగ్రత, మరో 3 రోజులు బయటకు రావొద్దని హెచ్చరికలు

ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోనూ ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరాయి. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో పగటి పూట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరాయి. అత్యధికంగా రాజమండ్రి ధవళేశ్వరం వద్ద 46.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రత్యేకంగా ఉభయ గోదావరి నుంచి నెల్లూరు వరకు ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నాయి. దీంతో అత్యవసర పనులు ఉంటే తప్పించి ఇంటి నుంచి బయటకు రాకుండా ఉండడమే మంచిదని వాతావరణ శాఖ సూచించింది.

ఈ సారి కాస్త ఆలస్యంగా వ‌ర్షాకాలం, జూన్ 4న కేర‌ళ‌కు నైరుతీ రుతుప‌వ‌నాలు, 4 రోజులు లేట్‌గా రుతుప‌వ‌నాలు రానున్న‌ట్లు తెలిపిన ఐఎండీ

ఏపీలో ఈరోజు 20 మండలాల్లో వడగాల్పు ప్రభావం ఉందని ఏపీ విపత్తుల నిర్వాహణ సంస్థ వెల్లడించింది. అనకాపల్లి జిల్లా 2, గుంటూరు 2, కాకినాడ 1, ఎన్టీఆర్ 3, పల్నాడు 3, వైఎస్సార్ జిల్లాలో 9 మండలాల్లో వడగాల్పులు ప్రభావం ఉంటుందని, మిగిలిన చోట్ల కూడా ఎండ ప్రభావం ఉండనున్నట్లు పేర్కొంది.

నేడు జిల్లాలో ఉష్ణోగ్రతల వివరాలు...



సంబంధిత వార్తలు

Heavy Rain Alert For Telugu States: బంగాళాఖాతంలో కొన‌సాగుతున్న అల్ప‌పీడ‌నం, తెలుగు రాష్ట్రాల‌కు భారీ వ‌ర్ష‌సూచ‌న‌, ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం

Sandhya Theatre Tragedy: రేవతి కుటుంబానికి రూ. 2 కోట్ల ఆర్థిక సాయం అందజేసిన అల్లు అరవింద్, బాబు త్వరగా కోలుకుని మన అందరితో తిరుగుతాడని ఆశిస్తున్నామని వెల్లడి

Sandhya Theatre Stampede Case: వీడియో ఇదిగో, ఇరవై రోజుల తర్వాత స్పృహలోకి వచ్చిన శ్రీతేజ్, అల్లు అర్జున్, తెలంగాణ ప్రభుత్వం మాకు మద్దతు ఇస్తున్నారని తెలిపిన తండ్రి భాస్కర్

Sandhya Theatre Stampede Case: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో మొత్తం నిందితుల జాబితా ఇదే, ఏ-1 నుంచి ఏ-8 వరకు సంధ్య థియేటర్ యాజమాన్యం, ఏ-18గా మైత్రీ మూవీస్‌