Mumbai Rains: ముంబైకి మళ్లీ భారీ వర్ష సూచన.. రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ.. పాఠశాలలకు సెలవు
సోమవారం కురిసిన వర్షానికే నగరం మొత్తం స్తంభించిపోయింది.
Mumbai, July 9: దేశ ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు (Mumbai Rains) అతలాకుతలం చేస్తున్నాయి. సోమవారం కురిసిన వర్షానికే నగరం మొత్తం స్తంభించిపోయింది. రోడ్డుపై ట్రాఫిక్ జామ్ లు, బస్సు, రైలు, విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాగా, మంగళవారం కూడా ముంబై నగరంలో భారీ వర్షం పడుతుందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. ఈ మేరకు రెడ్ అలర్ట్ (Red Alert) జారీ చేసింది. ఐఎండీ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు.
స్కూల్స్ మూసివేత
ముందు జాగ్రత్త చర్యగా ముంబై, థానే, నవీ ముంబై, పన్వెల్, పూణెతోపాటు రత్నగిరి-సింధుదుర్గ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలు, కళాశాలలకు మంగళవారం కూడా సెలవు ప్రకటించారు. అదేవిధంగా ముంబై యూనివర్సిటీలో ఈరోజు జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. ఇప్పటికే, రోడ్లమీద నిలిచిపోయిన నీటిని పారిశుధ్య సిబ్బంది తొలగించే పనిలోపడింది.
ఒంటరి పెండ్లి.. సోలో హనీమూన్.. జపాన్ లో ఇప్పుడిదే ట్రెండింగ్.. అసలేంటి ఇది??