TS Inter Results 2023: నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఉదయం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతులమీదుగా విడుదల.. విద్యార్థులు తమ ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలంటే?
నేటి ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నట్లు బోర్డు అధికారులు ప్రకటించారు.
Hyderabad, May 9: లక్షలాది మంది విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ ఇంటర్ ఫలితాలు (Telangana Inter Results) నేడే విడుదల కానున్నాయి. నేటి ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నట్లు బోర్డు అధికారులు (Board Officials) ప్రకటించారు. ఇంటర్ ఫలితాల విడుదల కార్యక్రమం నాంపల్లిలోని (Nampally) ఇంటర్ బోర్డు కార్యాలయంలో నిర్వహించనున్నారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నారు. మొదటి సంవత్సరం పరీక్షలకు 4,82,501 మంది, రెండో సంవత్సరం పరీక్షలకు 4,23, 901 మంది హాజరయ్యారు. దాదాపు 9.06 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన సమాధాన పత్రాల మూల్యంకన ప్రక్రియ ఏప్రిల్ రెండో వారంలోనే పూర్తయింది. కాగా ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఎగ్జామ్స్ మార్చి 15వ తేదీ నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఫలితాల కోసం ఈ లింక్స్ ను క్లిక్ చేయండి
- tsbie.cgg.gov.in
- results.cgg.gov.in
- examresults.ts.nic.in
- ntnews.com
- https://pratibha.eenadu.net/
- https://www.manabadi.com/
ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలంటే??
స్టెప్ 1: TSBIE అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి - tsbie.cgg.gov.in లేదా results.cgg.gov.in లేదా examresults.ts.nic.in లింక్స్ పై క్లిక్ చేయండి
స్టెప్ 2: "తెలంగాణ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్ష ఫలితాలు" అని ఆప్షన్ మీద క్లిక్ చేయండి
స్టెప్ 3: లింక్‌పై క్లిక్ చేసి, మీ హాల్ టిక్కెట్ నంబర్, ఇతర వివరాలను నమోదు చేయండి
స్టెప్ 4: సబ్ మిట్ బటన్‌పై క్లిక్ చేయండి.. ఫలితం చెక్ చేసుకోండి.