TTD SED Tickets: శ్రీవారి ప్రత్యేక దర్శన కోటా టికెట్లపై టీటీడీ ప్రకటన.. ఈ నెల 9న టికెట్ల కోటా విడుదల
జనవరి, ఫిబ్రవరి కోటాకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ టికెట్లపై (ఎస్ఈడీ) టీటీడీ ప్రకటన చేసింది. ఈ నెల 12 నుంచి 31 వరకు దర్శనాలకు సంబంధించిన టికెట్లతో పాటు, ఫిబ్రవరి నెలకు సంబంధించి టికెట్ల కోటాను కూడా ఒకేసారి విడుదల చేయనున్నారు.
Tirumala, Jan 7: శ్రీవారి భక్తులకు శుభవార్త. తిరుమల (Tirumala) క్షేత్రంలో ఈ నెల 2 నుంచి 11వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం (Vaikuntha Dwara Darshanam) టికెట్లు (Tickets) జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. దాంతో రూ.300 టికెట్లను, ఇతర ప్రత్యేక ప్రవేశ కేటగిరీల టికెట్లను జారీ చేయలేదు. ఈ నేపథ్యంలో, జనవరి, ఫిబ్రవరి కోటాకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ టికెట్లపై (ఎస్ఈడీ-SED) టీటీడీ (TTD) ప్రకటన చేసింది.
ఈ నెల 12 నుంచి 31 వరకు దర్శనాలకు సంబంధించిన టికెట్లతో పాటు, ఫిబ్రవరి నెలకు సంబంధించి టికెట్ల కోటాను కూడా ఒకేసారి విడుదల చేయనున్నారు. రెండు నెలలకు సంబంధించి స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్లను ఈ నెల 9 ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. భక్తులు ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ పేర్కొంది.
అంతేకాకుండా, వృద్ధులు, దివ్యాంగుల కోటా శ్రీవారి దర్శన టికెట్లను కూడా టీటీడీ విడుదల చేస్తోంది. ఈ టికెట్లు ఈ నెల 7న ఉదయం 9 గంటల నుంచి ఆన్ లైన్ లో అందుబాటులోకి రానున్నాయి.