NIA Rs 10 Lakh Reward: లారెన్స్‌ బిష్ణోయ్‌ సోదరుడు అన్మోల్‌ బిష్ణోయ్‌ గురించి చెప్తే రూ.10 లక్షల రివార్డు.. జాతీయ దర్యాప్తు సంస్థ ప్రకటన

మహారాష్ట్ర రాజకీయ నేత బాబా సిద్దిఖీ హత్య, బాలీవుడ్ నటుడు సల్మాన్‌ ఖాన్‌ పై బెదిరింపుల ఘటనలతో దేశవ్యాప్తంగా లారెన్స్‌ బిష్ణోయ్ గ్యాంగ్‌ పేరు పెద్దయెత్తున చర్చనీయంశం అయ్యింది.

Anmol Bishnoi (Credits: X)

Newdelhi, Oct 25: మహారాష్ట్ర (Maharastra) రాజకీయ నేత బాబా సిద్దిఖీ హత్య, బాలీవుడ్ నటుడు సల్మాన్‌ ఖాన్‌ పై బెదిరింపుల ఘటనలతో దేశవ్యాప్తంగా లారెన్స్‌ బిష్ణోయ్ (Lawrence Bishnoi) గ్యాంగ్‌ పేరు పెద్దయెత్తున చర్చనీయంశం అయ్యింది. ఈ నేపథ్యంలో లారెన్స్ సోదరుడు అన్మోల్‌ బిష్ణోయ్‌ (Anmol Bsihnoi)పై జాతీయ దర్యాప్తు సంస్థ –ఎన్ఐఏ (NIA) దృష్టి సారించింది. అన్మోల్ కి సంబంధించిన సమాచారం చెప్తే రూ.10 లక్షల రివార్డు ఇస్తామని ప్రకటించింది.

హైదరాబాద్ రాజేంద్రనగర్‌ లో బాలుడి కిడ్నాప్‌ కు య‌త్నం.. దుండగుడిని పట్టుకుని స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేసిన స్థానికులు (వీడియో)

అతను ఎందుకంటే?

సిద్ధిఖీ హత్యకు ముందు షూటర్లతో అన్మోల్‌ చాటింగ్ చేసినట్లు ముంబయి పోలీసులు గుర్తించారు. అంతేకాదు 2022లో నమోదైన రెండు కేసుల్లో అన్మోల్ అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలోనే ఎన్ఐఏ ఈ రివార్డు ప్రకటించింది.

మెదక్ జిల్లాలోని తూప్రాన్‌ లో తెల్లవారుజామున కారు షెడ్డులో అగ్నిప్రమాదం.. 8 కార్లు దగ్ధం (వీడియో)