
Chennai, Feb 17: తమిళనాడులోని (Tamil Nadu) పళనిలో ఓ నిమ్మకాయకు (Lemon) వేలంలో ఏకంగా రూ. 5 లక్షల ధర పలికింది. పుదుక్కోటై జిల్లా తిరువరుంగుళం వల్లనాట్టు చెట్టియార్ వర్గీయులు పళనిలో ఏటా మూడు రోజుల పాటు తైపూస ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఉదయం, మధ్యాహ్నం, రాత్రి అన్నదానం చేస్తారు. ఈ క్రమంలో స్వామి పాదాల వద్ద మూడు రోజుల పాటు రోజుకో నిమ్మకాయ పెట్టి పూజ చేస్తుంటారు. తాజాగా వాటిని వేలం వేయగా ఒక్కో నిమ్మకాయ రూ. 16 వేల నుంచి రూ. 40 వేల వరకు ధర పలికింది. తైపూసం రోజున మురుగన్ అభిషేకం సమయంలో స్వామి పాదల వద్ద ఉంచిన నిమ్మకాయను మాత్రం ఓ భక్తుడు రూ. 5.09 లక్షలకు సొంతం చేసుకున్నాడు.
ஒரு எலுமிச்சை பழம் ரூ.5 லட்சமா? அப்படி என்ன ஸ்பெஷல்.. எல்லாம் முருகனுக்காக!https://t.co/DuVCJZcTYL#palanimurugantemple #thaipusam2025 #lemon
— ABP Nadu (@abpnadu) February 14, 2025
ఎందుకంత ప్రత్యేకం?
స్వామి పాదాల వద్ద ఉంచిన నిమ్మకాయ తమ వద్ద ఉంటే శుభం జరుగుతుందని భక్తుల విశ్వాసం. అందుకనే పూజలో పెట్టే నిమ్మకాయలను భక్తులు పోటీ పడి మరీ వేలంలో దక్కించుకుంటారు. కాగా, ఈ వేలంలో వల్లనాట్లు చెట్టియార్లు మాత్రమే పాల్గొంటారు.