Republic Day Parade 2020: రిపబ్లిక్ శకటాలపై రాజకీయం, పరేడ్‌లో చోటు దక్కకపోవడంపై పలు రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వంపై ధ్వజం, గణతంత్ర దినోత్సవం పరేడ్‌లో అలరించనున్న శకటాలు ఇవే

ఆంధ్రప్రదేశ్, అస్సాం, ఛత్తీస్‌ఘర్, గోవా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మేఘాలయ, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ మరియు ఉత్తర ప్రదేశ్ శకటాలు పరేడ్ లో పాల్గొననున్నాయి.....

File image of Republic Day parade (Photo Credits: IANS)

New Delhi, January 3:  రిపబ్లిక్ డే 2020 పరేడ్ (Republic Day 2020 parade) కోసం  పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర మరియు కేరళ శకటాల (tableaux)కు చోటు దక్కకపోవడంపై రాజకీయంగా వివాదం చెలరేగింది. తమ శకటాలకు అనుమతి తిరస్కరించడం పట్ల మహారాష్ట్ర, కేరళ మరియు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉద్దేశ్యపూర్వకంగానే బీజేపీయేతర రాష్ట్రాల (Non-BJP States) పై కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు.

పౌరసత్వ సవరణ చట్టం (CAA)పై నిరసన వ్యక్తం చేస్తున్నందునే పశ్చిమ బెంగాల్ (West Bengal) శకటాన్ని మోదీ ప్రభుత్వం తిరస్కరించి, బెంగాలీలను అవమానించింది అని అధికార టీఎంసీ పార్టీ విమర్శించింది.

అయితే, పశ్చిమ బెంగాల్ శకటం నిబంధనలకు విరుద్ధంగా ఉన్నందునే ఆ శకటాన్ని తిరస్కరించినట్లు బీజేపీ పేర్కొంది. ఇక మరికొన్ని ఇతర రాష్ట్రాల శకటాలు సెలెక్షన్ ప్యానెల్ కమిటీ అంచనాలకు తగినట్లు లేవు, వచ్చిన ప్రతిపాదనల్లో అత్యుత్తమంగా ఉన్నవాటినే ఎంపిక చేశామని రక్షణ మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.

ఈ ఏడాది రిపబ్లిక్ డే పరేడ్ కోసం రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి మొత్తం 32 ప్రతిపాదనలు, కేంద్ర మంత్రిత్వ శాఖలు మరియు విభాగాలు 24 ప్రతిపాదనలు రాగా, మొత్తం 22 ప్రతిపాదనలు ఆమోదం పొందాయి. ఇందులో రాష్ట్రాలు మరియు యూటీలకు చెందిన శకటాలు 16 ఉన్నాయి.

రిపబ్లిక్ డే పరేడ్ 2020లో అలరించనున్న శకటాలు

 

ఆంధ్రప్రదేశ్, అస్సాం, ఛత్తీస్‌ఘర్, గోవా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మేఘాలయ, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ మరియు ఉత్తర ప్రదేశ్ శకటాలు పరేడ్ లో పాల్గొననున్నాయి.

రాష్ట్రాలు, యూటీల శకటాలతో పాటు...

పరిశ్రమలు మరియు అంతర్గత వాణిజ్య  విభాగం

తాగునీరు మరియు పారిశుద్ధ్య శాఖ

ఆర్థిక సేవల విభాగం

NDRF మరియు హోంశాఖ

CPWD, గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ

షిప్పింగ్ మంత్రిత్వ శాఖ

అనే ఆరు మంత్రిత్వ శాఖల విభాగాల శకటాలు పరేడ్ లో పాల్గొననున్నాయి.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

CM Chandrababu Davos Tour Highlights: దావోస్‌లో సీఎం చంద్రబాబు పర్యటన హైలెట్స్ ఇవిగో, బిల్ గేట్స్‌తో పాటు పలువురు ప్రముఖులతో భేటీ, ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా టూర్

Manipur Politics: బీజేపీ కూటమికి షాకిచ్చిన నితీష్ కుమార్, మణిపూర్‌లో ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నట్లు కీలక ప్రకటన

Raichur Road Accident: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మంత్రాలయ విద్యార్థులు మృతి, సంతాపం తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు, గవర్నర్ అబ్దుల్ నజీర్, అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ

Andhra Pradesh: వీడియో ఇదిగో, కీలక సమావేశాన్ని వదిలేసి ఆన్‌లైన్‌‌లో రమ్మీ ఆడుతూ కెమెరాకు చిక్కిన డీఆర్ఓ, ప్రజా సమస్యలను పక్కనపెట్టి ఇలా చేయడంపై తీవ్ర విమర్శలు

Share Now