Gold Smuggled Under Wig: ఇదొక కొత్త రకం స్మగ్లింగ్, తలకు విగ్గు ధరించి బంగారం స్మగ్లింగ్, 1.13 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న ఎయిర్‌పోర్టు కస్టమ్స్ అధికారులు, కొచ్చిలో సంఘటన
తెలివిగా స్మగ్లింగ్ చేద్దామనుకున్న ఓ యువకుడు కాలం కలిసిరాక అడ్డంగా బుక్కైపోయాడు. ఈ ఘటన కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకుంది.
Kochi,October 5: కాలం కలిసి రాక పోతే కర్రే పామై కాటు వేస్తుందనే సామెత ఈ స్టోరీకి అక్షరాల సరిపోతుంది. తెలివిగా స్మగ్లింగ్ చేద్దామనుకున్న ఓ యువకుడు కాలం కలిసిరాక అడ్డంగా బుక్కైపోయాడు. ఈ ఘటన కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. మలప్పురానికి చెందిన నౌషద్ అనే యువకుడు షార్జా నుంచి కొచ్చిన్ ఎయిర్‌పోర్టుకు వచ్చాడు. ముందుగా తన తలపై మధ్యభాగంలో వెంట్రుకలను కత్తిరించుకున్నాడు. ఆ భాగంలో బంగారం పెట్టి దానిపై జుట్టు అధికంగా ఉన్న విగ్‌ను కొనుగోలు చేసి ధరించాడు.ఈ నేపథ్యంలో కస్టమ్స్ అధికారుల కళ్ళు కప్పి తప్పించుకోవాలని అనుకున్నాడు. ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేస్తుండగా నౌషద్ పట్టుబడ్డాడు. విగ్‌లో ఉన్న 1.13 కేజీల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నౌషద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.