
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనం ముఖ్యంగా ఐదు లక్ష్యాల వైపు అడుగులు వేయాల్సి ఉంటుంది. అందులో మొదటిది లింగ వివక్ష లేని సమాజం వైపు అడుగు వేయడం. రెండవది మహిళలకు సమాన విద్య ఉద్యోగ అవకాశాలు కల్పించడం, మూడవది మహిళలకు భద్రత ఆరోగ్య సంరక్షణను పెంపొందించడం. అలాగే మహిళా సాధికారత స్వతంత్రం నిర్ణయాలను ప్రోత్సహించే దిశగా వాతావరణాన్ని పెంపొందించడం, దీంతో పాటు రాజకీయాలు ఉద్యోగాలు వ్యాపారాల్లో మహిళలకు సరైన వాటా అందించడమే లక్ష్యంగా ఈ మహిళా దినోత్సవం ఉద్దేశ్యాల్లో ప్రధానంగా ఉండాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ నేటి సమాజంలో ఇప్పటికీ మహిళల పట్ల అసమానతలు అణచివేత కొనసాగుతూనే ఉంది. మహిళలు అన్ని రంగాల్లోకి ముందుకు రావాలంటే విద్య ఉద్యోగం వ్యాపారం రాజకీయాల్లో సరైన భాగస్వామ్యం అనేది తప్పనిసరి. సమాజంలో ఒక మహిళను బలపరిస్తే ఆమె ఒక కుటుంబాన్ని బలపరుస్తుంది ఒక కుటుంబం బలంగా ఉంటే సమాజం అభివృద్ధి చెందుతుంది అనే నినాదంతో మనందరం ముందుకు వెళ్ళినప్పుడే ఈ సమాజంతో ఆనందంగా ముందుకు వెళుతుంది.
ప్రతి మహిళా ఆర్థికంగా బలపడాలి...సమాజంలో గౌరవంగా బ్రతకాలి...మహిళలందరి ముఖంలో చిరునవ్వు వుండాలి...మహిళా సాధికారత కోసం అహర్నిశలు కష్టపడదాం... అంతర్జాతీయ మహిళల దినోత్సవం శుభాకాంక్షలు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు