New Criminal Laws First Case: అమల్లోకి వచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలు.. ఢిల్లీలో తొలి కేసు నమోదు

ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానాల్లో వరుసగా భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం చట్టాలు ఆచరణలోకి వచ్చాయి.

Representative Image

Newdelhi, July 1: బ్రిటీష్ హయాంనాటి (British Era) చట్టాల స్థానంలో కొత్త క్రిమినల్ చట్టాలు నేటి అర్థరాత్రి నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానాల్లో వరుసగా భారతీయ న్యాయ సంహిత (Bharatiya Nyaya Sanhita), భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం చట్టాలు ఆచరణలోకి వచ్చాయి. కాగా ఈ కొత్త చట్టాల కింద దేశ రాజధాని ఢిల్లీలో మొట్టమొదటి కేసు నమోదైంది. రైల్వే ప్లాట్ ఫాంను ఆక్రమించిన కారణంగా ఓ రోడ్డు సైడ్ చిరు వ్యాపారి మీద భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 285 కింద ఈ కేసు నమోదు చేసినట్టు కమలా నగర్ పోలీసులు తెలిపారు.

మెగా డీఎస్సీ, పెన్షన్ల పెంపుకు ఏపీ కేబినెట్‌ ఆమోదం, ఏపీ మంత్రివర్గ సమావేశం తీసుకున్న నిర్ణయాలు ఇవే..

నెట్టింట విమర్శలు

ఈ కేసు విషయమై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. పొట్టకూటి కోసం బతుకు పోరాటం చేసే చిరు వ్యాపారులపై వేగంగా చర్యలు తీసుకునే పోలీసులు, బడా మోసగాళ్ళను ఎలా విడిచిపెడుతున్నారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కాగా,  ధ్వంసానికి సంబంధించిన ఘటనపై మధ్యప్రదేశ్ లోని భోపాల్‌ లోని నిషాత్‌పురా పోలీస్ స్టేషన్‌ లో అర్ధరాత్రి 12:20 గంటలకు కొత్త చట్టం కింద తొలి ఎఫ్‌ఐఆర్ నమోదైనట్టు వార్తలు వస్తున్నాయి.

ఎన్నికల ముందు జగన్ సర్కారు ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు, జులై 1న మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, టెట్ నిర్వహణపై ప్రభుత్వం కీలక నిర్ణయం