Rahul Gandhi’s Hindu Remarks: మోదీ హిందూ స‌మాజం కాదని రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు, ప్రధాని మోదీ ఏమన్నారంటే..

ఈ చ‌ర్చ‌లో ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. భ‌యం, ద్వేషం, అబద్దాలు వ్యాప్తి చేయ‌డం హిందూ మ‌తం కాదు అని రాహుల్ గాంధీ అన్నారు. అన్ని మ‌తాలు ధైర్యం గురించి మాట్లాడుతాయ‌ని, ఇస్లాం, సిక్కు మ‌తంలో భ‌యంలేద‌న్నారు.

PM Narendra Modi Hits Out at Rahul Gandhi’s Remarks

New Delhi, July 1: లోక్‌స‌భ‌లో రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగానికి ధ‌న్య‌వాద తీర్మానంపై నేడు చ‌ర్చ జ‌రిగింది. ఈ చ‌ర్చ‌లో ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. భ‌యం, ద్వేషం, అబద్దాలు వ్యాప్తి చేయ‌డం హిందూ మ‌తం కాదు అని రాహుల్ గాంధీ అన్నారు. అన్ని మ‌తాలు ధైర్యం గురించి మాట్లాడుతాయ‌ని, ఇస్లాం, సిక్కు మ‌తంలో భ‌యంలేద‌న్నారు. రాహుల్ ఆ వ్యాఖ్య‌లు చేసిన స‌మ‌యంలో స‌భ‌లో గంద‌ర‌గోళం నెల‌కొన్న‌ది. ఆ స‌మ‌యంలో ప్ర‌ధాని మోదీ జోక్యం చేసుకున్నారు.

స‌భ‌లో ఉన్నప్రధాని మోదీ మాట్లాడుతూ.. యావ‌త్ హిందూ స‌మాజం హింసాత్మ‌కం అని ఆరోప‌ణ‌లు చేయ‌డం తీవ్ర‌మైన అంశ‌మ‌ని అన్నారు. ఇక శివుడి ప్ల‌కార్డుల‌ను రాహుల్ గాంధీ స‌భ‌లో ప్ర‌ద‌ర్శించ‌డాన్ని స్పీక‌ర్ ఓం బిర్లా వ్య‌తిరేకించారు. రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ప్ర‌తిప‌క్షంలో ఉండ‌డం ప‌ట్ల గ‌ర్వంగా, సంతోషంగా ఉంద‌న్నారు. త‌మ‌కు అధికారం క‌న్నా ముఖ్య‌మైంది ఒక‌టి ఉంద‌ని, అది స‌త్యం అని రాహుల్ తెలిపారు.  ఢిల్లీ మద్యం పాలసీ కేసు, రెండు కేసుల్లోనూ కవితకు బెయిల్ నిరాకరించిన ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం

ప్ర‌ధాని మోదీ రాహుల్ వ్యాఖ్యలపై జోక్యం చేసుకున్న త‌ర్వాత ప్రతిపక్ష నేత మాట్లాడుతూ.. మోదీ హిందూ స‌మాజం కాదు అని, బీజేపీ హిందూ స‌మాజం కాదు అని, ఆర్ఎస్ఎస్ హిందూ స‌మాజం కాదు అని అన్నారు. వెంటనే మరోసారి ప్ర‌ధాని జోక్యం చేసుకుని మాట్లాడారు. రాజ్యాంగం, ప్ర‌జాస్వామ్యం త‌న‌కు కొన్ని నేర్పించాయ‌ని, ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్య‌ల‌ను గంభీరంగా తీసుకోవాల‌ని మోదీ అన్నారు.



సంబంధిత వార్తలు

Priyanka Gandhi: మీ కోసం పోరాడుతా..తనపై నమ్మకం ఉంచి రికార్డు మెజార్టీతో గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ప్రియాంక గాంధీ..ప్రజల వ్యక్తిగా పనిచేస్తానని వెల్లడి

Priyanka Gandhi: ఆరంభం అదుర్స్‌..రాహుల్ గాంధీ రికార్డు బ్రేక్ చేసిన ప్రియాంక గాంధీ, వయనాడ్‌లో 4 లక్షలకు పైగా మెజార్టీతో గెలుపు..కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు

Bandi Sanjay: మహారాష్ట్ర ఫలితాలు తెలంగాణలోనూ రిపీట్ అవుతాయి, సీఎం రేవంత్ ప్రచారం చేసిన చోట కాంగ్రెస్ ఓడిపోయిందన్న బండి సంజయ్...మోదీ అభివృద్ధి మంత్రమే పనిచేసిందని వెల్లడి

Priyanka Gandhi Vadra Leading in Wayanad: వయనాడ్‌ లో 46 వేల ఓట్ల ఆధిక్యంలో దూసుకుపోతున్న ప్రియాంక గాంధీ.. మహారాష్ట్రతో పాటు జార్ఖండ్ లో ఎన్డీయే, ఇండియా కూటమి మధ్య పోటీ హోరాహోరీ