Shivaji Maharaj Statue Collapse: నన్ను అందరూ క్షమించండి, ఛత్రపతి శివాజీ విగ్రహం కూలడంపై ప్రధాని మోదీ నోటి వెంట సంచలన వ్యాఖ్యలు, ఇంకా ఏమన్నారంటే..
ప్రతిపక్షాలు ఈ ఘటనపై బీజేపీ మీద విరుచుకుపడ్డాయి. ఈ నిరసనలపై, అలాగే విగ్రహం కూలడవపై ప్రధాని మోదీ స్పందించారు.
పాల్ఘర్, ఆగస్టు 30: మాల్వాన్‌లోని రాజ్‌కోట్ కోటలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం వర్షాలకు కూలిన సంగతి విదితమే. ప్రతిపక్షాలు ఈ ఘటనపై బీజేపీ మీద విరుచుకుపడ్డాయి. ఈ నిరసనలపై, అలాగే విగ్రహం కూలడవపై ప్రధాని మోదీ స్పందించారు. మరాఠా యోధుడు శివాజీ కేవలం రాజు మాత్రమే కాదని, తాను ఆరాధించే దేవుడంటూ కూలడంపై ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం క్షమాపణలు చెప్పారు.
మహారాజ్ మనకు రాజు మాత్రమే కాదు, దైవం. మాల్వాన్‌లో జరిగిన సంఘటనకు నేను మహారాష్ట్ర మరియు ఛత్రపతి శివాజీ మహారాజ్‌లకు శిరస్సు వంచి క్షమాపణలు కోరుతున్నాను. మేం రాజకీయాల కోసం మహానుభావులను ఉపయోగించుకోవడం లేదు’’ అని పాల్ఘర్ జిల్లాలో రూ.76,000 కోట్లతో వధ్వన్ పోర్టుకు శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని మోదీ అన్నారు. వీడియో ఇదిగో, మహారాష్ట్రలో కూలిపోయిన భారీ శివాజీ విగ్రహం, మోదీ సర్కారుపై విమర్శలు ఎక్కుపెట్టిన ప్రతిపక్షాలు
నేను ఇక్కడికి వచ్చినప్పుడు శివాజీ మహారాజ్ పాదాలకు తల వంచి క్షమించమని అడిగాను. శివాజీ మహారాజ్‌ను తాము ఆరాధించే దైవంగా భావించే ప్రజలు (విగ్రహం పడిపోవడంతో) ఆందోళన చెందుతున్నారు. మనమందరం ఆరాధించే అటువంటి దైవాన్ని పూజించే వారికి నేను కూడా క్షమాపణలు కోరుతున్నాను. మన సంస్కృతి వేరు. మాకు ఆరాధ్య దైవత (ఆరాధ్య దైవం) కంటే పెద్దది ఏమీ లేదు” అని ప్రధాని మోదీ అన్నారు. 2013లో బీజేపీ నన్ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించినప్పుడు నేను చేసిన మొదటి పని రాయగఢ్ కోటకు వెళ్లి ఛత్రపతి శివాజీ మహారాజ్ సమాధి ముందు కూర్చుని ప్రార్థనలు చేసి దేశసేవలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడమన్నారు.
Here's Video
సావర్కర్‌ను అవమానించినందుకు, దుర్భాషలాడినందుకు ప్రతిపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ క్షమాపణలు చెప్పలేదని ఆయన మండిపడ్డారు. “భారత గొప్ప కుమారుడు వీర్ సావర్కర్ ను దుర్భాషలాడారు. వారు (ప్రతిపక్షాలు) దేశభక్తుల మనోభావాలను తుంగలో తొక్కారు. సావర్కర్‌ను అవమానించిన తర్వాత కూడా క్షమాపణలు చెప్పరు. వారు కోర్టుకు వెళతారు, కానీ వారు పశ్చాత్తాపపడరు. ఇది వారి సంప్రదాయం'' అన్నారు. . ఏలియన్స్ గురించి ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు, వాటి పరిచయం చాలా ప్రమాదకరం అంటూ...
గత ఏడాది డిసెంబరులో మాల్వాన్‌లోని రాజ్‌కోట్ కోటలో ప్రధాని మోదీ ప్రారంభించిన విగ్రహం మొన్న వరదలకు కూలడంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే మరియు ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కూడా క్షమాపణలు చెప్పడంతో ప్రధానమంత్రి క్షమాపణలు చెప్పారు. అంతేకాకుండా, మహారాష్ట్రలోని మహాయుతి ప్రభుత్వంపై ప్రతిపక్షాలు దాడులకు దిగుతున్న తరుణంలో ప్రధాని మోదీ బహిరంగ క్షమాపణలు చెప్పారు.
విగ్రహం కూలడంపై నిరసనగా మహా వికాస్ అఘాడి ఆదివారం హుటాత్మా చౌక్ వద్ద ఆందోళన నిర్వహించింది. నిర్ణీత నిబంధనలను దాటవేసి, ఒక ప్రముఖ కాంట్రాక్టర్ మరియు శిల్పికి కాకుండా, కళ్యాణ్ ఆధారిత కాంట్రాక్టర్‌కు ప్రాజెక్ట్ ఇవ్వడంలో అవినీతి జరిగిందని ఆరోపించింది.