Tamil Nadu Fire Accident: టపాకాయలు లారీలో లోడ్‌ చేస్తుండగా చెలరేగిన మంటలు, 10 మంది మృతి, మరో 15 మందికి తీవ్రగాయాలు, తమిళనాడు- కర్ణాటక సరిహద్దుల్లో భారీ ప్రమాదం

దీంతో పది మంది మృతి చెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా టపాకాయల గోడౌన్ లో పనిచేస్తున్న వారుగా గుర్తించారు.

Hosur Fire Accident (PIC@ X)

Hosur, OCT 07: తమిళనాడులో భారీ అగ్నిప్రమాదం (Fire accident) జరిగింది. బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందగా, మరో 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. కర్ణాటక – తమిళనాడు సరిహద్దులోని హోసూరు సమీపంలో గల అత్తిపల్లి బాణాసంచా తయారీ కేంద్రంలో (Fire Cracker) పేలుడు సంభవించింది. టపాకాయలను కంటైనర్ వాహనంలో లోడ్ చేస్తుండగా విద్యుత్ హై టెన్షన్ వైర్లు తగలడంతో ప్రమాదం జరిగింది. దీంతో పది మంది మృతి చెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా టపాకాయల గోడౌన్ లో పనిచేస్తున్న వారుగా గుర్తించారు.

 

సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుంది. మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.