Odisha Shocker: రెండో పెళ్లి చేసుకున్నాడని తండ్రిని నరికి చంపిన కొడుకు, సవతి తల్లిపై కిరాతకంగా అత్యాచారం, ఒడిషాలో ఉన్మాదిగా మారిన 20 ఏళ్ల యువకుడు
ఆ తర్వాత ఆమెపై లైంగిక దాడికి (Rapes Step-Mother)పాల్పడ్డాడు. ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. (Odisha Shoker) టోమ్కా (Tomkha) పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన 65 ఏళ్ల వ్యక్తి మొదటి భార్య చనిపోయింది. దీంతో అతడు ఒక మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆ వ్యక్తికి 20 ఏళ్ల కుమారుడు ఉన్నాడు
Bhuvaneshwar, March 09: సవతి తల్లి వద్ద ఉంటున్న తండ్రిని ఒక యువకుడు నరికి చంపాడు (Hacks Father To Death). ఆ తర్వాత ఆమెపై లైంగిక దాడికి (Rapes Step-Mother)పాల్పడ్డాడు. ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. (Odisha Shoker) టోమ్కా (Tomka) పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన 65 ఏళ్ల వ్యక్తి మొదటి భార్య చనిపోయింది. దీంతో అతడు ఒక మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆ వ్యక్తికి 20 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే తండ్రితో కలిసి అతడు ఉండేందుకు సవతి తల్లి ఒప్పుకో లేదు.
దీంతో ఆ యువకుడు మరో గ్రామంలో ఉంటున్నాడు. తండ్రితో కలిసి తనను ఉండనివ్వకపోవడంపై వారి మధ్య గొడవ జరుగుతున్నది. కాగా, ఆ యువకుడు ఆదివారం రాత్రి తండ్రి ఇంటికి వచ్చాడు. సవతి తల్లిని తిట్టడంతోపాటు ఆమె పట్ల మొరటుగా ప్రవర్తించాడు. దీంతో తండ్రి జోక్యం చేసుకున్నాడు. భార్యకు మద్దతుగా అతడు మాట్లాడాడు. ఈ నేపథ్యంలో వాగ్వాదం పెరిగి ఘర్షణకు దారి తీసింది. దీంతో ఆగ్రహం చెందిన యువకుడు తన వద్ద ఉన్న పదునైన ఆయుధంతో తండ్రిపై దాడి చేసి నరికి చంపాడు. అనంతరం సవతి తల్లిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు.
మరోవైపు బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో హత్యకు గురైన వ్యక్తి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సవతి తల్లి ఫిర్యాదు ఆధారంగా అతడిపై కేసు నమోదు చేశారు. అనంతరం సోమవారం ఆ యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. తండ్రిని ఎందుకు హత్య చేశాడు, సవతి తల్లిపై అత్యాచారానికి (Rapes Step Mother) ఎందుకు పాల్పడ్డాడు అన్న దానిపై అతడ్ని ప్రశ్నిస్తున్నారు. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.