Indian Railways: ప్రారంభమైన రైల్వే బుకింగ్స్, జూన్ 1న పట్టాలెక్కనున్న 200 ప్యాసింజర్ రైళ్లు, సాధారణంగానే టికెట్ ధరలు, జనరల్‌ కోచ్‌ల్లోనూ రిజర్వుడ్‌ సీట్లు

టికెట్లు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ (IRCTC Website) లేదా యాప్‌ (APP) ద్వారా మాత్రమే బుక్‌ చేసుకోవాలి. కౌంటర్లు బంద్‌ ఉంటాయి. నాన్‌ ఏసీతోపాటు ఏసీ కోచ్‌లనూ (AC And Non AC) కూడా నడుపనున్నారు. ఈ జాబితాలో తెలంగాణ, ఏపీ (TS And AP) నుంచి ప్రారంభమయ్యే పలు రైళ్లు ఉన్నాయి.

RailTel to continue free WiFi service at railway stations after Google will stop Project Station(Photo-ANI)

New Delhi, May 21: వచ్చే నెల 1 నుంచి పట్టాలెక్కనున్న 200 ప్యాసింజర్‌ రైళ్లకు గురువారం ఉదయం 10 గంటల నుంచి బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయి. టికెట్లు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ (IRCTC Website) లేదా యాప్‌ (APP) ద్వారా మాత్రమే బుక్‌ చేసుకోవాలి. కౌంటర్లు బంద్‌ ఉంటాయి. నాన్‌ ఏసీతోపాటు ఏసీ కోచ్‌లనూ (AC And Non AC) కూడా నడుపనున్నారు. ఈ జాబితాలో తెలంగాణ, ఏపీ (TS And AP) నుంచి ప్రారంభమయ్యే పలు రైళ్లు ఉన్నాయి. దేశాన్ని వణికిస్తున్న ప్రధాన నగరాలు, తాజాగా 24 గంటల్లో 5,609 కరోనా కేసులు, 132 మంది మృతి, దేశ వ్యాప్తంగా లక్షా 12 వేలు దాటిన కోవిడ్-19 కేసులు

దేశవ్యాప్తంగా జూన్‌ 1వ తేదీ నుంచి దురంతో, సంపర్క్‌ క్రాంతి, జన శతాబ్ది, పూర్వా ఎక్స్‌ప్రెస్‌ వంటి ప్రముఖ రైళ్ల రాకపోకలు ప్రారంభం కానున్నాయని రైల్వేశాఖ బుధవారం ప్రకటించింది. గతంలో చెప్పినట్లుగా ఈ రైళ్లలో నాన్‌–ఎసీ తరగతి మాత్రమే కాకుండా ఏసీ తరగతి కూడా ఉంటుందని పేర్కొంది.ఈనెల 25 నుంచి దేశీయ విమాన సర్వీసులు, కీలక ప్రకటన చేసిన విమానయాన శాఖ, ప్రయాణీకులు భౌతిక దూరం పాటించేలా పలు చర్యలు

జనరల్‌ కోచ్‌ల్లోనూ రిజర్వుడ్‌ సీట్లు ఉంటాయని తెలిపింది. టికెట్‌ రుసుములు సాధారణంగానే ఉంటాయని స్పష్టం చేసింది. గరిష్టంగా 30 రోజుల ముందు ప్రయాణానికి అడ్వాన్స్‌ బుకింగ్‌ చేసుకోవచ్చని ఇండియన్ రైల్వేస్ (Indian Railways) సూచించింది.

తెలంగాణ, ఏపీలకు సంబంధించిన రైళ్ల వివరాలు

హైదరాబాద్‌–ముంబై: సీఎస్‌టీ హుస్సేన్‌సాగర్‌ ఎక్స్‌ప్రెస్‌

సికింద్రాబాద్‌–హౌరా: ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌

హైదరాబాద్‌– న్యూఢిల్లీ: తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌

సికింద్రాబాద్‌ – దానాపూర్‌: దానాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌

సికింద్రాబాద్‌– గుంటూరు: గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌

నిజామాబాద్‌– తిరుపతి: రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌

హైదరాబాద్‌– విశాఖపట్నం: గోదావరి ఎక్స్‌ప్రెస్‌

సికింద్రాబాద్‌– నిజాముద్దీన్‌: దురంతో ఎక్స్‌ప్రెస్‌

వేరే ప్రాంతాల్లో మొదలై తెలంగాణ మీదుగా నడిచే రైళ్లు..

విశాఖపట్నం–న్యూఢిల్లీ: ఏపీ ఎక్స్‌ప్రెస్‌

హౌరా–యశ్వంతపూర్‌: దురంతో ఎక్స్‌ప్రెస్‌

ఎర్నాకులం– నిజాముద్దీన్‌: దురంతో ఎక్స్‌ప్రెస్‌

దానాపూర్‌–కేఎస్‌ఆర్‌ బెంగుళూరు: సంగమిత్ర ఎక్స్‌ప్రెస్‌

సూచనలు

గరిష్ఠంగా 30 రోజుల ముందు అడ్వాన్స్‌ బుకింగ్స్‌ చేసుకోవచ్చు. ప్రయాణికులు 90 నిమిషాలు ముందుగానే స్టేషన్‌కు చేరుకోవాలి.మాస్క్‌ ధరించడం, ఆరోగ్యసేతు యాప్‌ తప్పనిసరి. ప్రతి ఒక్కరికీ స్క్రీనింగ్‌ నిర్వహిస్తారు. కరోనా లక్షణా లు లేనివారినే ప్రయాణానికి అనుమతినిస్తారు. ఆర్‌ఏసీ, వెయిటింగ్‌ లిస్ట్‌ ఉంటుంది. కన్ఫర్మ్‌ అయితేనే రైల్లోకి అనుమతిస్తారు.రైల్వే స్టేషన్లలో కేటరింగ్‌ సేవలు ప్రారంభించేందుకు, ఆహారశాలలు తెరిచేందుకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. ఆహారాన్ని పార్సిళ్ల రూపంలో ఇవ్వాలని, ప్రయాణికులు ఆహారశాలల్లోనే కూర్చొని తినేందుకు వీల్లేదని స్పష్టం చేసింది.