A special chartered flight will take them to Punjab's Amritsar. (Representational)

New Delhi, May 20: భారత్‌లో విమాన రాకపోకలకు ( Domestic Flights) సంబంధించి విమానయాన శాఖ కీలక ప్రకటన చేసింది. దేశీయ విమాన సర్వీసులు ఈనెల 25 నుంచి ప్రారంభం (Domestic Flight Operations) కానున్నాయి. కరోనా కట్టడికి మార్చి 25న దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ అనంతరం సుదీర్ఘ విరామం తర్వాత విమానాల రాకపోకలు ప్రారంభమవనున్నాయి. ఆయుష్మాన్ భారత్ లబ్ది పొందినవారి సంఖ్య కోటికి పైగానే, అందరికీ ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపిన ప్రధాని మోదీ, త్వరలో ఆయుష్మాన్ భారత్ లబ్ధిదారులతో సంభాషణ

మే 25 సోమవారం నుంచి విమాన సర్వీసుల పునరుద్ధరణకు సిద్ధంగా ఉండాలని అన్ని విమానాశ్రయాలు, ఎయిర్‌లైన్స్‌కు సమాచారం అందించామని పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్‌ పూరి (Hardeep Singh Puri) ట్వీట్‌ చేశారు. ఇక విమాన ప్రయాణీకులకు సంబంధించి నిర్ధేశిత ప్రమాణాలు, మార్గదర్శకాలను పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడిస్తుందని ట్వీట్‌లో తెలిపారు. విమానాల్లో తక్కువ సీట్లను అమర్చడంతో పాటు మధ్య సీటును ఖాళీగా ఉంచడం ద్వారా ప్రయాణీకులు భౌతిక దూరం పాటించేలా పలు చర్యలు చేపడతారు.

Here's the tweet:

అన్ని ఎయిర్‌పోర్ట్‌లు మే 25 నుంచి సేవలను పునరుద్ధరించి.. ప్రయాణికులకు అందుబాటులో ఉండేందుకు సిద్ధం కావాలని ఆయన ఆదేశించారు. అయితే.. దశలవారీగా విమానాలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు స్పష్టం చేశారు. అన్ని నగరాల మధ్య రాకపోకలకు అవకాశం ఇస్తారా, లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఇప్పటికే వందేభారత్ మిషన్‌లో భాగంగా ఇతర దేశాల నుంచి భారత్‌కు విమానాల్లో ప్రయాణికులను తరలిస్తున్న సంగతి తెలిసిందే.