Coronavirus outbreak in India (Photo Credits: IANS)

New Delhi, May 21: దేశంలో కరోనా వైరస్‌ (India COVID-19) విజృంభిస్తోంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 5,609 కరోనా కేసులు (Coronavirus) నమోదు కాగా, 132 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,12,359కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ఉదయం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న 45,229 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా, 3,435 మంది మృతిచెందారు. ఈనెల 25 నుంచి దేశీయ విమాన సర్వీసులు, కీలక ప్రకటన చేసిన విమానయాన శాఖ, ప్రయాణీకులు భౌతిక దూరం పాటించేలా పలు చర్యలు

ప్రస్తుతం దేశంలో 63,624 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. దేశంలో నమోదైన కేసుల్లో 30 శాతానికి పైగా కేవలం మహారాష్ట్రలోనే (Maharashtra) ఉన్నాయి. అక్కడ మొత్తం 39,297 కరోనా కేసులు నమోదు కాగా, 10,318 మంది కోలుకున్నారు. 1,390 మంది మృతిచెందారు. మహారాష్ట్ర తర్వాత తమిళనాడు(13,191), గుజరాత్‌(12,537), ఢిల్లీ(11,088)లలో కేసులు అధింగా ఉన్నాయి. మ‌రోవైపు ప్ర‌పంచ‌వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 50 ల‌క్ష‌లు దాటింది. బ్రెజిల్‌లో ప‌రిస్థితి దారుణంగా ఉన్న‌ది.

పెద్ద సంఖ్యలో వలస కార్మికులకు కరోనా వైరస్ సోకడం ఆందోళన కలిగిస్తోంది. వివిధ ప్రాంతాల నుంచి యూపీకి (Uttar Pradesh) తిరిగివచ్చిన వలస కార్మికుల్లో 1,041 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఒక్క బుధవారం రోజే 249 కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో యూపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,175కు పెరిగింది. ఢిల్లీ నిజాముద్దీన్ తబ్లీగ్ జమాత్ సమావేశం అనంతరం యూపీలో 1304 మందికి కరోనా సోకింది.

అనంతరం వలసకార్మికుల్లో ఎక్కువ కరోనా కేసులు వెలుగుచూశాయి. బారాబంకీలో 50 మంది వలసకార్మికులకు కరోనా వచ్చింది. అయోధ్యలో 21 మందికి, ఈటావాలో 15 మందికి, ప్రతాప్ ఘడ్ లో 11 మందికి, రాంపూర్ లో పదిమందికి కరోనా సోకింది. రాష్ట్రానికి 5.36 లక్షల మంది వలసకార్మికులు తిరిగిరాగా, వారిని ఆశా కార్యకర్తలు పరీక్షిస్తున్నారు. వలసకార్మికుల్లో కరోనా లక్షణాలున్న 43,625 మంది నుంచి శాంపిళ్లను సేకరించి పరీక్షకు పంపించారు.  ఆయుష్మాన్ భారత్ లబ్ది పొందినవారి సంఖ్య కోటికి పైగానే, అందరికీ ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపిన ప్రధాని మోదీ, త్వరలో ఆయుష్మాన్ భారత్ లబ్ధిదారులతో సంభాషణ

ముంబైలో (Mumbai) 22700 కి పైగా కరోనా కేసులు న‌మోద‌య్యాయి. 800కి పైగా మరణాలు చోటుచేసుకున్నాయి. భారతదేశంలో మొత్తం కరోనా కేసులలో ముంబైలో 21 శాతం ఉన్నాయి. ముంబైలోని ధారవిలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇవాళ కొత్తగా 25 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ధారవిలో మొత్తం కేసుల సంఖ్య 1378కు చేరుకుందని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది.

గడిచిన 24 గంటల్లో ఒక్క మృతి కూడా నమోదు కాలేదని పేర్కొంది. బలిగా నగర్, ధారవి క్రాస్ రోడ్, ఆజాద్ నగర్, కమలా నెహ్రూ నగర్, రాజివ్ గాంధీ నగర్, ఇందిరా నగర్ ప్రాంతాల్లో ఈ కొత్త కేసులు నమోదైనట్లు బీఎంసీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మంగళవారం ఒక్కరోజే ముంబైలో 1411 పాజిటివ్ కేసులు నమోదు కాగా..43 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

తమిళనాడులో (Tamil Nadu) తాజాగా కరోనా వల్ల మరో ముగ్గురు చనిపోవడంతో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 87కు పెరిగింది. బుధవారం సాయంత్రం వరకు 5882 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు.కొత్తగా 743 పాజిటివ్‌ కేసులు బయటపడగా, చెన్నైలోనే 557 నమోదయ్యాయి. మరో మూడు మరణాలు సంభవించగా, ఒకేరోజు 987 మంది కరోనా బారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. కొత్త కేసుల్లో 83 మంది మహారాష్ట్ర నుంచి తిరిగివచ్చినవారని రాష్ట్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్‌బులెటిన్‌లో తెలిపింది. మొత్తంగా తమిళనాట పాజిటివ్‌ కేసులు 13,191కి, చెన్నైలో మాత్రం 8,228కి చేరుకున్నాయి.

కర్ణాటకలో కొత్తగా 67 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న సాయంత్రం 5 గంటల నుంచి ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు ఈ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1462కు చేరకుందని కర్ణాటక వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. వీటిలో 864 యాక్టివ్ కేసులున్నట్లు పేర్కొంది.కర్ణాటక ప్రభుత్వం లాక్ డౌన్ కాలాన్ని మరో 2 రోజులు పొడిగించగా..మే 19వ తేదీ అర్థరాత్రితో మూడో దశ లాక్ డౌన్ ముగిసింది.