Ahmedabad Serial Bomb Blast Case: వరుస పేలుళ్ల కేసులో 38 మందికి ఉరిశిక్ష, అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసులో స్పెషల్ కోర్టు తీర్పు, 13 ఏళ్ల పాటూ సాగిన విచారణ, ట్విస్టుల మధ్య సాగిన దర్యాప్తు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2008 అహ్మదాబాద్‌ వరుస బాంబు పేలుళ్ల (2008 Ahmedabad bomb blast) కేసులో తీర్పు ఇచ్చింది కోర్టు.మొత్తం 49 మంది దోషుల్లో 38 మందికి మరణశిక్ష విధించింది స్పెషల్ కోర్టు. ఈ కేసులో మొత్తం 77 మంది నిందితులను విచారించిన గుజరాత్ స్పెషల్‌ కోర్టు..49 మందిని దోషులుగా నిర్ధారించగా, సరైన సాక్యాధారాలు లేకపోవడంతో మరో 28 మంది నిర్దోషులుగా ప్రకటించింది.

Court Judgment, representational image | File Photo

Ahmedabad, Feb 18: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2008 అహ్మదాబాద్‌ వరుస బాంబు పేలుళ్ల (2008 Ahmedabad bomb blast) కేసులో తీర్పు ఇచ్చింది కోర్టు.మొత్తం 49 మంది దోషుల్లో 38 మందికి మరణశిక్ష విధించింది స్పెషల్ కోర్టు.  మరో 11 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.

ఈ కేసులో మొత్తం 77 మంది నిందితులను విచారించిన గుజరాత్ స్పెషల్‌ కోర్టు..49 మందిని దోషులుగా నిర్ధారించగా, సరైన సాక్యాధారాలు లేకపోవడంతో మరో 28 మంది నిర్దోషులుగా ప్రకటించింది. 2008న జూలై 26న గంట వ్యవధిలోనే అహ్మదాబాద్‌ నగరంలో సుమారు 21 చోట్ల వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో సుమారు 56 మంది మృత్యువాత పడగా, మరో 200 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.  ఈ కేసుకు సంబంధించి సుధీర్ఘంగా విచారణ జరిగింది.

నిషేధిత స్టూడెంట్స్‌ ఇస్లామిక్‌ మూవ్‌మెంట్‌ ఆఫ్‌ ఇండియా (SIMI)కి చెందిన ఉగ్రవాద సంస్థ ఇండియన్‌ ముజాహిదీన్‌ (IM)తో సంబంధమున్న వ్యక్తులే ఈ పేలుళ్లకు పాల్పడ్డారని నిఘా సంస్థలు తేల్చాయి. 2002 గోద్రా అల్లర్లకు ప్రతీకారంగానే ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పూనుకొన్నారని తెలిపాయి.

Telangana: తెలంగాణలో ప్రభుత్వ భూముల వేలం ప్రక్రియకు గ్రీన్‌సిగ్నల్‌, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించిన హైకోర్టు

ఈ కేసుకు సంబంధించి గుజరాత్ పోలీసులు మొత్తం 85 మందిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం జరిగిన పరిణామాలతో 78 మందిపై విచారణ కొనసాగించారు. ఆపై నిందితుల్లో ఒకరు అప్రూవర్‌గా మారడంతో నిందితుల సంఖ్య 77కి తగ్గింది. కాగా నిందితులపై హత్య, నేరపూరిత కుట్ర, చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం (UAPA) ఆధారంగా కేసులు నమోదు చేశారు.

Delhi: ఢిల్లీలో బ్యాగులో బాంబు, పరారీలో నలుగురు యువకులు, సీమపురిలో ఓ ఇంట్లో బ్యాగులో పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్న ఎన్‌ఎస్‌జీ బృందం

ఇక డిసెంబర్‌ 2009లో ప్రారంభమైన ఈ కేసు విచారణ సుదీర్ఘకాలం పాటు కొనసాగింది. గుజరాత్‌ స్పెషల్‌ కోర్ట్‌1,100 మందికి పైగా సాక్షులను విచారించింది. అయితే 2016లో కొంతమంది నిందితులు జైలులో 213 అడుగుల పొడవైన సొరంగం తవ్వి తప్పించుకోవడానికి ప్రయత్నించడం సంచలనం సృష్టించింది. గత ఏడాది సెప్టెంబర్‌లో 77 మంది నిందితులపై ప్రత్యేక కోర్టు విచారణ ముగించింది. తాజాగా వీరిలో 49 మందిని దోషులుగా తేల్చింది. సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో మరో 28 మందిని నిర్దోషులుగా ప్రకటించింది.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

HC on Vijay Mallya’s Plea: విజయ్ మాల్యా రుణ ఎగవేత కేసులో కీలక మలుపు, బ్యాంకులకు నోటీసులు జారీ చేసిన కర్ణాటక హైకోర్టు, చేసిన అప్పు కంటే ఎక్కువ మొత్తం రికవరీ చేశారని మాల్యా పిటిషన్

YouTuber Mastan Sai Arrest: హీరో రాజ్ తరుణ్-లావణ్య కేసు, యూట్యూబర్ మస్తాన్ సాయి అరెస్ట్, హార్డ్ డిస్కులో 200కు పైగా న్యూడ్ వీడియోలు..

SC on Maha Kumbh 2025 Stampede: కుంభమేళా తొక్కిసలాట ఘటనపై సుప్రీం కీలక వ్యాఖ్యలు, దురదృష్టకరమంటూ పిల్‌ను తిరస్కరించిన అత్యున్నత ధర్మాసనం

Dalit Girl Rape-Murder in Ayodhya: మనుషులేనా వీళ్లు.. యువతి ప్రైవేట్ పార్టులో కర్రపెట్టి కామాంధులు దారుణంగా అత్యాచారం, అయోధ్యలో దళిత యువతిపై హత్యాచారం కేసులో ఒళ్లు గగుర్పొడిచే నిజాలు

Share Now