Suspicious Bag Found on Road. (Photo Credits: ANI)

New Delhi, February 17: దేశ రాజధాని ఢిల్లీలో ఐఈడీ బాంబు కలకలం సృష్టించింది. సీమపురిలో ఓ ఇంట్లోని బ్యాగులో పేలుడు పదార్ధం (IED Recovered from Delhi's Old Seemapuri House) ఐఈడీని పోలీసులు గుర్తించారు. వివరాల ప్రకారం.. ఘాజిపూర్‌ పూల మార్కెట్‌ కేసు విచారణకు వెళ్లిన పోలీసులకు ఓ ఇంట్లో అనుమానాస్పద బ్యాగు కనిపించింది.

వెంటనే బ్యాగును తెరిచి చూడటంతో బాంబు కనిపించడంతో పోలీసులు షాకయ్యారు. సమాచారం అందుకున్న బాంబ్‌ స్వ్కాడ్‌, ఎన్‌ఎస్‌జీ బృందం, స్పెషల్‌ సెల్‌ పోలీసులు (Bomb Disposal Squad on Spot) రంగంలోకి దిగారు. దీంతో ఇంటి యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. గత నెలలో పూల మార్కెట్‌లో 3 కేజీల ఆర్డీఎక్స్‌ను పోలీసులు గుర్తించారు. గాజీపూర్ ఆర్డీఎక్స్ పేలుడు ఘ‌టన‌కు సంబంధించిన ద‌ర్యాప్తులో సీమాపూరి ప్రాంతంలోని ఈ ఇంటి గురించే త‌మ‌కు స‌మాచారం అందింద‌ని ఢిల్లీ పోలీసులు పేర్కొంటున్నారు.

కరోనా ఆంక్షలు ఎత్తేయండి, రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖలు రాసిన కేంద్ర ఆరోగ్యశాఖ, కోవిడ్ కేసుల సంఖ్య అధికంగా ఉంటేనే ఆంక్షలు విధించాలని లేఖలో వెల్లడి

దీంతో స్పెష‌ల్ టీమ్ పోలీసులు ద‌ర్యాప్తు నిమిత్తం ఈ ఇంటికి వ‌చ్చార‌ని, ఈ స‌మ‌యంలోనే అనుమానాస్ప‌దంగా ఓ బ్యాగు క‌నిపించింద‌ని వివ‌రించారు. అయితే ఈ ఇంట్లో న‌లుగురు యువ‌కులు నివ‌సిస్తున్నార‌ని, ప్ర‌స్తుతం వారు ప‌రారీలో ఉన్నార‌ని పోలీసులు వెల్ల‌డించారు.