Special Olympics World Games: స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ గేమ్స్ కోసం బెర్లిన్ బయలుదేరిన భారత బృందం, రూ.7.7 కోట్లు కేటాయించిన కేంద్రం
198 మంది అథ్లెట్లు సహా 280 మంది సభ్యులతో కూడిన భారత బృందం, ఈ నెల 12న, జర్మనీలోని బెర్లిన్ లో స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ గేమ్స్‌లో పాల్గొనడానికి బయలుదేరింది
198 మంది అథ్లెట్లు సహా 280 మంది సభ్యులతో కూడిన భారత బృందం, ఈ నెల 12న, జర్మనీలోని బెర్లిన్ లో స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ గేమ్స్‌లో పాల్గొనడానికి బయలుదేరింది.బెర్లిన్ బయలుదేరడానికి ముందు, ఈ నెల 8న జరిగిన వీడ్కోలు వేడుకలో కేంద్ర యువజన వ్యవహారాలు & క్రీడల శాఖ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్‌ను కలిసే అవకాశం కూడా జట్టుకు లభించింది.
ఇండియా వర్సెస్ వెస్టిండీస్ సిరీస్ మ్యాచ్‌లన్నీ ఉచితంగా జియో సినిమాలో..
స్పెషల్ ఒలింపిక్స్‌లో భారత బృందం పాల్గొనడానికి రూ.7.7 కోట్లు కేటాయించారు. ఇది, ఇప్పటి వరకు ఈవెంట్ కోసం మంజూరు చేసిన అత్యధిక మొత్తం.190 దేశాల నుంచి 7000 మంది అథ్లెట్లు పాల్గొనే ప్రపంచ స్థాయి క్రీడల పోటీల కోసం సిద్ధం కావడానికి దిల్లీలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (శాయ్) జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో సన్నాహక శిక్షణ శిబిరం కూడా నిర్వహించారు. ఈ నెల 17 నుంచి 25 వరకు జరిగే ఈ ప్రపంచ స్థాయి క్రీడల పోటీల్లో, 16 రకాల క్రీడా విభాగాల్లో భారత అథ్లెట్లు పతకాల కోసం పోరాడతారు.