Maharashtra Cops: మహారాష్ట్రలో 1,030మంది పోలీసులకు కరోనా, కోవిడ్-19 కల్లోలానికి అక్కడ 59మంది పోలీసులు మృతి, ముంబైలో అత్యధిక కేసులు నమోదు
ఈ వైరస్ ధాటికి మహారాష్ర్ట ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. గడిచిన 24 గంటల్లో మరో 77 మంది పోలీసులకు (police personnel) కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వైద్యాధికారులు తెలిపారు. ఇద్దరు పోలీసులు కరోనాతో (two others died) చనిపోయారు. మహారాష్ర్ట పోలీసు విభాగంలో (Maharashtra Cops) కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,030కి చేరుకోగా, మృతుల సంఖ్య 59కి చేరింది. కరోనా విజృంభణతో పోలీసులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
Mumbai, June 29: మహారాష్ర్టలో కరోనా వైరస్ కల్లోలాన్ని రేపుతోంది. ఈ వైరస్ ధాటికి మహారాష్ర్ట ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. గడిచిన 24 గంటల్లో మరో 77 మంది పోలీసులకు (police personnel) కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వైద్యాధికారులు తెలిపారు. ఇద్దరు పోలీసులు కరోనాతో (two others died) చనిపోయారు. మహారాష్ర్ట పోలీసు విభాగంలో (Maharashtra Cops) కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,030కి చేరుకోగా, మృతుల సంఖ్య 59కి చేరింది. కరోనా విజృంభణతో పోలీసులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. జూలై 31 వరకు లాక్‌డౌన్ పొడిగింపు, కీలక నిర్ణయం తీసుకున్న మహారాష్ట్ర సర్కారు, ముంబైని వణికిస్తున్న కరోనావైరస్
మహారాష్ర్టలో ఇప్పటి వరకు 1,64,626 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 7,429 మంది ప్రాణాలు కోల్పోయారు. ముంబైలో అత్యధికంగా 75,539, థానేలో 34,257, పుణెలో 20,870, పాల్గర్ లో 5,267, ఔరంగాబాద్ లో 4,833 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
గత నాలుగు నెలలుగా మహారాష్ట్రలో కరోనాను కట్టడి చేయడం కోసం ఎన్ని చర్యలు తీసుకున్నా కేసుల సంఖ్య తగ్గడంలేదు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను జూలై 31 వరకు పొడిగించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు మహా సర్కారు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే, లాక్‌డౌన్ నియమ నిబంధనలు ఎలా ఉండాలనే విషయంలో స్థానిక పరిస్థితులను బట్టి జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు నిర్ణయం తీసుకుంటారని మహారాష్ట్ర ప్రభుత్వం తన ప్రకటనలో పేర్కొన్నది.
Here's ANI Tweet
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అత్యవసరాలు, నిత్యవసరాలకు సంబంధించిన అన్ని రకాల వ్యాపార కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపింది. అత్యవసరంకానీ వాటిలో వేటిని అనుమతించాలి, వేటిని అనుమతించకూడదు అనే విషయంలో స్థానిక అధికార యంత్రంగమే నిర్ణయాలు తీసుకుంటుందని స్పష్టం చేసింది.