Mumbai, June 29: మహారాష్ట్రలో కరోనా కేసులు రోజురోజుకు వేగంగా పెరిగిపోతున్నాయి. అక్కడ కరోనాని కట్టడి చేయడం కోసం గత నాలుగు నెలలుగా ఎన్ని చర్యలు తీసుకున్నా కేసుల సంఖ్య పెరుగుతున్నదే తప్ప తగ్గడంలేదు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం (Maharashtra Govt) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను (Maharashtra Lockdown) జూలై 31 వరకు పొడిగించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు మహా సర్కారు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. 24 గంటల్లో 19 వేల కేసులు నమోదు, దేశంలో 5.5 లక్షలకు చేరువలో కరోనా కేసులు, ఒకే రోజు 380 మంది కరోనాతో మరణం
అయితే, లాక్‌డౌన్ (Lockdown) నియమ నిబంధనలు ఎలా ఉండాలనే విషయంలో స్థానిక పరిస్థితులను బట్టి జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు నిర్ణయం తీసుకుంటారని మహారాష్ట్ర ప్రభుత్వం తన ప్రకటనలో పేర్కొన్నది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అత్యవసరాలు, నిత్యవసరాలకు సంబంధించిన అన్ని రకాల వ్యాపార కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపింది. అత్యవసరంకానీ వాటిలో వేటిని అనుమతించాలి, వేటిని అనుమతించకూడదు అనే విషయంలో స్థానిక అధికార యంత్రంగమే నిర్ణయాలు తీసుకుంటుందని స్పష్టం చేసింది.
Maharashtra Government extends lockdown in the state till 31
Maharashtra Government extends lockdown in the state till 31st July. pic.twitter.com/reUYA00uXI
— ANI (@ANI) June 29, 2020
మహారాష్ట్రలో 1,59 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కరోనా నుండి 84,245 మంది కోలుకొన్నారు. ఇప్పటివరకు కరోనాతో రాష్ట్రంలో 7273 మంది మరణించినట్టుగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి.
ఇదిలా ఉంటే మార్కె ట్లు, సెలూన్లు, బార్బర్ షాపులు, ఇతర అవసరాల కోసం తమ ఇళ్ల నుంచి 2 కిలోమీటర్ల పరిధి దాటి వెళ్లొద్దని ముంబై వాసులను పోలీసులు ఆదేశించారు. ఈ పరిధి దాటి షాపింగ్ చేసేం దుకు వెళ్లడాన్ని బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే ఔట్ డోర్ ఎక్సర్ సైజ్ లకు కూడా అనుమతి లేదన్నారు.
ఆఫీసులు, మెడికల్ ఎమర్జెన్సీ కోసం వెళ్లే వాళ్లకు మాత్రం 2 కిలోమీటర్ల పరిధి దాటి వెళ్లేందుకు అనుమతి ఉంటుందని చెప్పారు. ఈ విషయంలో ఉద్యోగులు, అత్యవసర సేవల సిబ్బందిని మినహాయించారు. చాలామంది కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ తమతో పాటు ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేస్తున్నట్టు గుర్తించిన అధికారులు.. ఇకపై ప్రజలెవరూ రెండు కిలోమీటర్ల పరిధిని దాటి వెళ్లడానికి వీల్లేదని పేర్కొన్నారు. వారేం చేసినా ఆ పరిధిలోనేనని స్పష్టం చేశారు.
కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న నేపథ్యం లో మరింత జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఫిజికల్ డిస్టెన్సింగ్ పాటించాలని సూచించింది. సరైన కారణం లేకుండా తిరిగే వెహికల్స్ ను స్వాధీనం చేసుకుంటామని ముంబై పోలీస్ శాఖ హెచ్చిరించింది. వ్యాయామం, వాకింగ్ వంటి వాటిని కూడా రెండు కిలోమీటర్ల పరిధిలోనే చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరు మాస్క్ తప్పని సరిగా ధరించాలని, భౌతిక దూరం పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.