Diwali Bonanza: ఉద్యోగులకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్, దీపావళికి కానుకగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ 17 శాతం డి.ఎ అందిస్తున్నట్లుగా ప్రకటించిన కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్

ఉద్యోగులు ఎంతగానో ఎదురుచూస్తున్న డి.ఎ ఈ దీపావళికి అందుకోబోతున్నారు. జూలై, ఆగష్టు, సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలలకు ఏరియర్స్ రూపంలో కలిపి, మొత్తం ఒకేసారి ఈ నవంబర్ లో ఇవ్వనున్నారు....

Union Environment Minister Prakash K Javadekar | (Photo Credits: ANI)

New Delhi, October 09:  ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్ దీపావళి బొనాంజా (Diwali Bonanza) ను ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం అధ్వర్యంలో పనిచేసే ఉద్యోగులందరికీ దీపావళి పండుగ కానుకగా వారు కోరుకున్నట్లుగానే 05% DA (Dearness Allowance) పెంపుదల చేస్తున్నట్లుగా కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ (Prakash Javadekar) ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో దేశవ్యాప్తంగా గల 50 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు మరియు 62 లక్షల మంది పెన్షనర్లు లబ్ది పొందనున్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ ఖజనా నుంచి రూ. 16,000 కోట్లు అదనంగా వెచ్చించాల్సి ఉంటుంది.

ఉద్యోగులకు అందించాల్సిన డి.ఎ విషయంలో ప్రతి ఆరు నెలలకోసారి కేంద్ర ప్రభుత్వం విశ్లేషణ చేపడుతుంది. ఆ తర్వాత రెండు నెలల్లో పెంచిన డి.ఎను అమలు చేస్తారు. ఈ ఏడాది జనవరిలో డి.ఎను పెంచిన ప్రభుత్వం, ఆ తర్వాత జూలైలో మరోసారి పెంచాల్సి ఉంది. అయితే కొన్ని పాలనాపరమైన కారణాల చేత డి.ఎ పెంపుదల వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఉద్యోగులు ఎంతగానో ఎదురుచూస్తున్న డి.ఎ ఈ దీపావళికి అందుకోబోతున్నారు. జూలై, ఆగష్టు, సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలలకు ఏరియర్స్ రూపంలో కలిపి, మొత్తం ఒకేసారి ఈ నవంబర్‌లో ఇవ్వనున్నారు. మోదీ నాయకత్వంలో కొన్ని మంచి నిర్ణయాలు తీసుకోబడ్డాయి, అందులో భాగంగానే ఉద్యోగులకు ఈ శుభవార్త చెప్తున్నామని ప్రకాశ్ జవదేకర్ ట్వీట్ చేశారు.

ప్రకాశ్ జవదేకర్ ట్వీట్

 

ప్రస్తుతం జీతంతో పాటు 12 శాతం డి.ఎ అందుకుంటున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అదనంగా మరో 5 శాతం డి.ఎ పెంపును కోరుకుంటున్నారు. ఇందుకు 7వ వేతన సంఘం (7th Pay Commission) కూడా అంగీకారం తెలుపుతూ గత ఆగష్టులోనే కేంద్రానికి సిఫారసు చేసింది. 7వ వేతన సంఘం సిఫారసులను ఆమోదించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడున్న 12 శాతానికి మరో 5% జోడించి మొత్తంగా ఉద్యోగుల సాలరీలలో 17శాతం అదనంగా డి.ఎ.గా అందించనున్నారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

EPFO Users Withdraw Money Via UPI Apps: గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యూపీఐలతో ఇకపై పీఎఫ్‌ సొమ్ము విత్‌ డ్రా.. రెండు, మూడు నెలల్లో అందుబాటులోకి కొత్త సదుపాయం.. పూర్తి వివరాలు ఇవిగో..!

IAS Transfers in Telangana: తెలంగాణలో ఎనిమిది మంది ఐఏఎస్ అధికారుల బదిలీ, ఆరోగ్య శ్రీ సీఈవో శివకుమార్‌ స్థానంలో కర్ణన్‌

Delhi CM Rekha Gupta Oath: ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ప్రమాణస్వీకారం.. సిద్ధమైన రాంలీలా మైదానం, రేఖా గుప్తాతో పాటు ఆరుగురు మంత్రుల ప్రమాణస్వీకారం, వివరాలివే

Jagan Slams Chandrababu Govt: ప్రతిపక్షనేతకు భద్రత కల్పించరా, రేపు నీకు ఇదే పరిస్థితి వస్తే ఏం చేస్తావు చంద్రబాబు, గుంటూరులో మండిపడిన జగన్, కూటమి ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందని మండిపాటు

Share Now