SI Suicide Case: ఎస్సీ - ఎస్టీ కేసు....ఆత్మహత్య డ్రామా...వెరసీ ఎస్‌ఐ ఆత్మహత్య..వాజేడు ఎస్‌ఐ హరీష్ ఘటనలో పోలీసుల నిర్థారణ
సూర్యాపేటలో ఇద్దరు యువకులను, ఓ కుటుంబాన్ని వేధింపులకు గురి చేసింది యువతి. పరిచయం పెంచుకుని ఆపై పెళ్లి చేసుకోవాలని వేధింపులకు గురిచేసింది.
Hyd, Dec 7: వాజేడు SI ఆత్మహత్య ఘటనలో వెలుగులోకి మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సూర్యాపేటలో ఇద్దరు యువకులను, ఓ కుటుంబాన్ని వేధింపులకు గురి చేసింది యువతి. పరిచయం పెంచుకుని ఆపై పెళ్లి చేసుకోవాలని వేధింపులకు గురిచేసింది.
వినకుంటే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, లైంగిక వేధింపుల కేసులు పెడతానని బెదిరింపులకు పాల్పడింది. లేదంటే సూసైడ్ చేసుకుంటానని బ్లాక్ మెయిల్ చేసిందని పోలీసులు నిర్దారణకు వచ్చారు.
హరీశ్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు యువతిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఏడు నెలల కిందట హరీష్‌కు ఓ యువతి ఫోన్ చేయగా, మాటామాటా కలిసి.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇద్దరూ చాట్ చేసుకునేవారు.హైదరాబాద్లో చదువుకునే ఆమె వారంలో రెండు రోజులు వాజేడుకు వచ్చి ఉండి వెళ్లేది.. ఈ క్రమంలోనే ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో బిటెక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ఉరివేసుకుని ఆత్మహత్య, కాలేజ్ బయట ఆందోళన చేపట్టిన తల్లిదండ్రులు
ఆమె గురించి ఆరా తీసిన హరీష్‌కు, సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలానికి చెందిన యువతి ఊర్లో ఉన్నప్పుడు ముగ్గురు యువకులతో స్నేహంగా ఉండేది. ఒకరు పెళ్లికి నిరాకరించడంతో చిలుకూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైందని విషయం తెలిసింది. దీంతో హరీశ్ ఆమెతో పెళ్లికి ఒప్పుకోలేదు. అదే విషయం ఆమెకు చెప్పడంతో మాట్లాడేందుకు ఆదివారం సాయంత్రం వాజేడు ముళ్లకట్ట సమీపంలోని ఓ రిసార్టుకు వెళ్లారు. అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.
సెటిల్మెంట్ చేసుకోవడానికి హరీష్ ప్రయత్నించగా, ఇందుకు యువతి ఒప్పుకోకుండా, ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు చెబుతాననడంతో మనస్తాపంతో హరీష్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.