COVID-19 in Maharashtra:మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో కలకలం, 10మంది మంత్రులు, 20 మంది ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్, ఆందోళనలో మిగిలిన ఎమ్మెల్యేలు
అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న 10 మంది మంత్రులు(10 ministers), 20 మంది ఎమ్మెల్యేల(20 MLA s)కు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. వారితో కాంటాక్ట్ లో ఉన్న మిగిలిన ఎమ్మెల్యేలు, వారి సిబ్బంది, కుటుంబ సభ్యులకు కరోనా టెస్టులు చేయనున్నారు.
Mumbai January 01: మహారాష్ట్ర(Maharashtra)లో కరోనా విజృంభిస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న 10 మంది మంత్రులు(10 ministers), 20 మంది ఎమ్మెల్యేల(20 MLA s)కు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. వారితో కాంటాక్ట్ లో ఉన్న మిగిలిన ఎమ్మెల్యేలు, వారి సిబ్బంది, కుటుంబ సభ్యులకు కరోనా టెస్టులు చేయనున్నారు. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం అజిత్ పవార్(ajith pawar) తెలిపారు. ఇలాగే కేసులు పెరుగుతుంటే, ప్రభుత్వం మరిన్ని కఠిన ఆంక్షలు అమలు చేయాల్సి ఉంటుందని ఆయన చెప్పారు.
ఇవాళ కేవలం మహారాష్ట్రలోనే 454 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు(Omicron Cases) నమోదు అయ్యాయి. వాస్తవానికి శీతాకాల అసెంబ్లీ సమావేశాలను(Assembly sessions) సాధారణంగా నాగపూర్‌లో నిర్వహిస్తారు. కానీ కోవిడ్ మహమ్మారి(Covid-19) వల్ల ఈ సారి ఆ సమావేశాలను ముంబై(Mumbai)లో నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాల వేళ మొత్తం 50 మంది వరకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది.