Coronavirus in India: భారత్‌లో కరోనా డేంజర్ బెల్స్, 22వేలకు పైగా కేసులు నమోదు, రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం
Coronavirus | Representational Image (Photo Credits: Pixabay)

New Delhi January 01: నిపుణులు హెచ్చరించినట్లే భారత్‌(India Corona)లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఒమిక్రాన్(Omicron variant) వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో క్రమంగా కేసుల సంఖ్య పెరుగుతోంది. 2021 ఏడాది చివరి రోజున అధికంగా కేసులు రికార్డయ్యాయి. శుక్రవారం కొత్తగా 22,775 మంది కరోనా బారిన(New corona cases in India) పడ్డారు. దీంతో దేశంలో మొత్తం కేసులు 3,48,61,579కి చేరాయి. ఇందులో 3,42,75,312 మంది బాధితులు కరోనా నుంచి బయటపడ్డారు.

గతంతో పోలిస్తే యాక్టీవ్ కేసులు(Surge in active cases) కూడా పెరడగం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో ప్రస్తుతం 1,04,781 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 4,81,486 మంది మృతిచెందారు. కాగా, గత 24 గంటల్లో కొత్తగా 8949 మంది కోలుకోగా, 406 మంది మరణించారని(Corona deaths) కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం కరోనా రికవరీ రేటు 98.32 శాతంగా ఉందని తెలిపింది.

ఇక దేశంలో ఒమిక్రాన్‌ కేసులు(Omicron cases in India) 1431కి చేరాయి. ఇందులో అత్యధికంగా మహారాష్ట్రలోనే ఉన్నాయి. రాష్ట్రంలో 454 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో 351 కేసులు, తమిళనాడులో 118, గుజరాత్‌లో 115, కేరళలో 109, రాజస్థాన్‌ 69, తెలంగాణ 62 చొప్పున ఉన్నాయి. మొత్తంగా 23 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ కొత్త వేరియంట్‌ కేసులు నమోదవుతున్నాయి. కాగా, ఒమిక్రాన్‌ బాధితుల్లో 488 మంది డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.