COVID-19 Vaccination: కరోనా వ్యాక్సిన్‌కు ఆధార్ తప్పనిసరి కాదు, ఎవరి వద్ద ఆధార్ ఇవ్వాలని వత్తిడి చేయరాదని అధికారులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
ఓ పిల్ విషయంలో సుప్రీంకోర్టు స్పందిస్తూ.. వ్యాక్సిన్ (COVID-19 Vaccination) ఇచ్చే సమయంలో ఎవరి వద్ద ఆధార్ ఇవ్వాలని వత్తిడి చేయరాదని (Aadhaar Card Not Mandatory ) అధికారులకు అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.
New Delhi, Feb 7: కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి ఆధార్ వివరాలు తప్పనిసరి కాదు కేంద్రం ప్రభుత్వం సుప్రీంకోర్టుకు చెప్పింది. ఓ పిల్ విషయంలో సుప్రీంకోర్టు స్పందిస్తూ.. వ్యాక్సిన్ (COVID-19 Vaccination) ఇచ్చే సమయంలో ఎవరి వద్ద ఆధార్ ఇవ్వాలని వత్తిడి చేయరాదని (Aadhaar Card Not Mandatory ) అధికారులకు అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. జస్టిస్ డీవై చంద్రచూడ్, సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం ఇవాళ ఓ పిల్‌ను విచారించింది. ఆ సమయంలో ధర్మాసనం ఆదేశాలు ఇస్తూ.. టీకా ఇస్తున్న సందర్భంగా ఆధార్ కార్డు కోసం వత్తిడి చేయరాదు అని పేర్కొన్నది. కో
విన్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ కోసం ఆధార్ కార్డు తప్పనిసరి కాదు అని కేంద్ర ఆరోగ్యశాఖ గతంలోనే స్పష్టం (Centre Tells Supreme Court) చేసింది. ఆరోగ్యశాఖ తరపున వాదించిన అడ్వకేట్ అమన్ శర్మ మాట్లాడుతూ.. 87 లక్షల మందికి ఎటువంటి ఐడీ కార్డు లేకుండానే టీకా ఇచ్చినట్లు చెప్పారు. దేశంలో తాజాగా గడిచిన 24 గంటల్లో నమోదైన కేసుల్లో భారీ తగ్గుదల కనిపించింది. దేశవ్యాప్తంగా నమోదైన కొత్త కరోనా కేసులు లక్ష దిగువకు చేరాయి.
దేశంలో గత 24 గంటల్లో 83,876 మందికి కరోనా, నిన్న 895 మంది మృతి, రోజువారీ పాజిటివిటీ రేటు 7.25 శాతం
దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 83,876 కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. అలాగే కొత్తగా 1,99,054 మంది కరోనా బాధితులు కోలుకున్నట్లు తెలిపింది. దేశంలో కరోనా పాజిటివిటీ రేటు కూడా 7.25 శాతానికి తగ్గింది. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా 2.62 శాతానికి తగ్గినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రస్తుతం 11,08,938 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు మొత్తం 169.63 కోట్ల కొవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగింది.