SC on Abortion: భర్త ఆ పని కోసం భార్యను బలవంతం చేసినా అది అత్యాచారమే, పెళ్లి కాని మహిళలు కూడా అబార్షన్‌ చేయించుకోవచ్చు, వివాహిత స్త్రీలే శృంగారం చేయాలని నిబంధన ఏమీ లేదని తెలిపిన సుప్రీంకోర్టు

చట్ట ప్రకారం సురక్షితమైన అబార్షన్‌ మహిళలందరూ చేసుకోవచ్చని అత్యున్నత న్యాయస్థానం గురువారం వెల్లడించింది.

Representative Image of Supreme Court ( Photo Credits: Wikimedia Commons )

New Delhi, Sep 29: అబార్షన్స్‌పై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పు (SC on Abortion) వెల్లడించింది. చట్ట ప్రకారం సురక్షితమైన అబార్షన్‌ మహిళలందరూ చేసుకోవచ్చని అత్యున్నత న్యాయస్థానం గురువారం వెల్లడించింది. అవాంఛిత గర్భాన్ని తొలగించుకునేందుకు మహిళ వైవాహిక స్థితిని ప్రామాణికంగా పరిగణించలేమని తెలిపింది. పెళ్లితో సంబంధం లేకుండా అబార్షన్‌ చేయించుకునే హక్కు (All Woman Have Right To Abort Unwanted Pregnancy) మహిళకు ఉందని తెలిపింది.

పెళ్లి కాని మహిళలు (Married and Unmarried Women) కూడా అబార్షన్‌ చేయించుకోవచ్చని పేర్కొంది. గర్భం దాల్చిన 24 వారాల వరకు మెడికల్‌ టెర్మినేషన్‌ ఆఫ్‌ ప్రెగ్నెన్సీ (ఎంటీపీ) చట్టం ప్రకారం అబార్షన్‌కు అనుమతినిచ్చింది. అదే విధంగా భార్య ప్రమేయం లేకుండా భర్త బలవంతం చేసినా అది అత్యాచారమే అవుతుందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.

ప్యాసింజ‌ర్ కార్ల‌లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఉండాల్సిందే, వ‌చ్చే ఏడాది అక్టోబ‌ర్ ఒక‌టో తేదీ నుంచి అమ‌లు చేయనున్న‌ట్లు తెలిపిన కేంద్రం

వైవాహిక అత్యాచారం నేరంగా పరిగణించాలన్న సుప్రీంకోర్టు.. దాని ద్వారా కలిగే గర్భాన్ని కూడా అబార్షన్ చేసుకునే అధికారం మహిళలకు ఉందని తెలిపింది. ప్రతి భారతీయ మహిళ తనకు నచ్చినది ఎంచుకునే హక్కు ఉందని, కేవలం వివాహిత స్త్రీలే శృంగారం చేయాలని నిబంధన ఏమీ లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

మెడికల్‌ టెర్మినేషన్‌ ఆఫ్‌ ప్రెగ్నెన్సీకి (ఎంటీపీ) సంబంధించిన ఓ కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ఈ విధంగా వ్యాఖ్యానించింది. ‘పెళ్లైన వారిని 24 వారాల లోపు అబార్షన్‌కు అనుమతిస్తూ, పెళ్లి కాని వారిని అనుమతించకపోవడం సరికాదు. కాలం మారింది. చట్టం స్థిరంగా ఉండకూడదు. మారుతున్న సామాజిక వాస్తవాలకు అనుగుణంగా నిబంధనలు మారుతుంటాయి’ అని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.