Parliament Winter Session Starting Today: నేటి నుంచి పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు.. డిసెంబర్‌ 20 వరకు కొనసాగే అవకాశం.. వక్ఫ్‌ సహా 16 బిల్లులపై చర్చ.. అదానీ, మణిపూర్‌ అంశాలపై ఉభయసభల్లో వాడీవేడీ యుద్ధం

డిసెంబర్‌ 20 వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి.

Parliament (photo-ANI)

Newdelhi, Nov 25: పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు (Parliament Winter Session Starting Today) సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. డిసెంబర్‌ 20 వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. సమావేశాల సందర్భంగా వక్ఫ్‌ (సవరణ) సహా 16 బిల్లులను కేంద్ర ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనున్నది. ఇదేసమయంలో దేశాన్ని కుదిపేసిన మణిపూర్‌ హింస, ఇటీవల సంచలనం సృష్టించిన గౌతమ్‌ అదానీ (Adani) అవినీతి చర్యలపై యూఎస్‌ అరెస్ట్‌ వారెంట్‌ జారీ తదితర అంశాలపై ఈ సమావేశాల్లో మోదీ సర్కారును నిలదీసేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. దీంతో ఈ శీతాకాల సమావేశాలు హాట్ హాట్ గా ఉండబోతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దేశమంతా ఏకకాలంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన జమిలి ఎన్నికల బిల్లును లిస్టులో చేర్చకపోయినా దానిని ప్రవేశపెట్టవచ్చునని భావిస్తున్నారు.

చలితో గజగజలాడుతున్న తెలంగాణ.. సంగారెడ్డి, ఆదిలాబాద్‌ జిల్లాల్లో 9 డిగ్రీల కంటే తక్కువకు పడిపోయిన ఉష్ణోగ్రతలు.. అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరిక

26న ప్రసంగించనున్న రాష్ట్రపతి

రాజ్యాంగ ఆమోద 75వ వార్షికోత్సవ వేడుకల ప్రారంభోత్సవానికి గుర్తుగా మంగళవారం నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో పాత పార్లమెంట్‌ భవనంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ కర్‌, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌ సభ స్పీకర్‌ ఓం బిర్లా కూడా పాత పార్లమెంట్‌ భవనంలోని సెంట్రల్‌ హాల్‌ లో ప్రసంగిస్తారు.

బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం.. ఎల్లుండి నుంచి ఏపీలో భారీ వర్షాలు.. మూడు రోజుల పాటు సముద్రంలో అలజడి.. మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని అధికారుల హెచ్చరికలు