Vijayawada, Nov 25: ఆగ్నేయ బంగాళాఖాతంలో (Bay of Bengal) శనివారం ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడింది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనిస్తూ నేడు దక్షిణ బంగాళాఖాతంలో ప్రవేశించి వాయుగుండంగా మారనుందని వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. వాయుగుండం ప్రభావంతో ఎల్లుండి నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమశి పాటు ఏపీవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని (Rains), ఉత్తర కోస్తాలో పొడి వాతావరణం కొనసాగుతుందని పేర్కొన్నారు. కాగా వాయుగుండం తీరం దిశగా వచ్చే సమయంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వరి కోతలు కోసే రైతులు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు, కొండ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. మూడు రోజుల పాటు సముద్రంలో అలజడి ఉండే నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేసింది.
తొలిరోజు ఐపీఎల్ ఆక్షన్ లో ఏ జట్లు ఏ ప్లేయర్ ను కొనుగోలు చేశాయంటే? ఫుల్ లిస్ట్ ఇదుగోండి
బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం
పశ్చిమ వాయువ్య దిశగా తమిళనాడు, శ్రీలంక వైపు కదులుతూ వాయుగుండంగా మారే అవకాశం
ఏపీలో బుధవారం నుంచి శనివారం వరకూ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు
మూడు రోజుల పాటు సముద్రంలో అలజడి ఉండే నేపథ్యంలో… https://t.co/6ejK1xvXip
— BIG TV Breaking News (@bigtvtelugu) November 25, 2024
27న ఇక్కడ వర్షాలు
నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయి.
28న ఇక్కడ వర్షాలు
అనకాపల్లి, కాకినాడ, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయి.
29న ఇక్కడ వర్షాలు
అనకాపల్లి, కాకినాడ, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం తెలిపింది.