Afghanistan Crisis: అప్ఘనిస్తాన్ పరిస్థితులపై విపక్షాలకు క్లుప్తంగా వివరించండి, విదేశాంగ శాఖకు ఆదేశాలు జారీ చేసిన ప్రధాని మోదీ, ఈనెల 26న వివిధ రాజకీయ పార్టీల పార్లమెంటరీ నేతలతో అఖిలపక్ష సమావేశం

ఈ విషయాన్ని (Narendra Modi Govt to Brief Leaders of Political Parties) విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ (S. Jaishankar) సోమవారంనాడు ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు.

PM Narendra at Modi Meeting. (Photo Credits: ANI)

New Delhi, August 23: అప్ఘనిస్తాన్ పరిణామాలపై విపక్ష పార్టీలకు సంక్షిప్తంగా వివరించాలని విదేశాంగ శాఖను ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఆదేశించారు. ఈ విషయాన్ని (Narendra Modi Govt to Brief Leaders of Political Parties) విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ (S. Jaishankar) సోమవారంనాడు ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన తక్కిన వివరాలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలియజేస్తారని ఆయన చెప్పారు. కాబూల్ తాలిబాన్ గుప్పిట్లోకి వెళ్లిన నేపథ్యంలో అక్కడి భారత పౌరులను (Indians) కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకువస్తున్న నేపథ్యంలో మోదీ ఈ తాజా ఆదేశాలిచ్చారు.

రాబోయే రోజుల్లో అప్ఘనిస్థాన్‌ నుండి భారతీయులను సురక్షితంగా తరలించేందుకు సంబంధింత అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని ఈనెల 17న జాతీయ భద్రతపై క్యాబినెట్ కమిటీ (సీసీఎస్) సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రధాని మోదీ ఆదేశాలిచ్చారు. సురక్షితంగా అందర్నీ అప్ఘనిస్థాన్ నుంచి భారత్‌కు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎంఈఏ ఒక ప్రకటనలో పేర్కొంది. కాబూల్ విమానాశ్రయం నుంచి ఆపరేషనల్ స్టాటస్ అనేది ఈ విషయంలో ప్రధాన సవాలని తెలిపింది.

మళ్లీ కరోనా ముప్పు ముంచుకొస్తోంది, అక్టోబర్‌లో ప్రమాదకరంగా కోవిడ్ థర్డ్ వేవ్, పీఎంవోకు నివేదిక అందజేసిన ఎన్ఐడీఎం, సెప్టెంబరులో ప్రతిరోజూ 4 నుంచి 5 లక్షల కరోనా కేసులు నమోదయ్యే అవకాశాలున్నాయని తెలిపిన నీతి ఆయోగ్

కాగా, ఆదివారంనాడు భారత ప్రభుత్వం మూడు వేర్వేరు విమానాల్లో సుమారు 400 మందిని వెనక్కి తీసుకువచ్చింది. సోమవారంనాడు ఖతార్ రాజధాని దోహా నుంచి నాలుగు వేర్వేరు విమానాల్లో 146 మందిని భారత్ వెనక్కి తీసుకువచ్చింది. వీరందరినీ అప్ఘన్‌లో భద్రతా పరిస్థితి పూర్తిగా విషమించడానికి ముందే అక్కడి నుంచి నాటో, అమెరికన్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో ఇటీవల ఖతార్ తరలించారు.

ఆఫ్ఘ‌న్ వివ‌రాల‌ను ఫ్లోర్ లీడ‌ర్ల‌కు చెప్పాల‌ని మోదీ చేసిన దిశానిర్దేశంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. ఆయ‌న త‌న ట్విట్ట‌ర్‌లో రియాక్ట్ అయ్యారు. ప్ర‌తిప‌క్ష నేత‌ల‌కు ప్ర‌ధాని మోదీయే ఎందుకు ఆఫ్ఘ‌న్ వివ‌రాల‌ను వెల్ల‌డించ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. జైశంక‌ర్ చేసిన ట్వీట్‌కు ఆయ‌న కౌంట‌ర్ ట్వీట్ చేశారు. ఆఫ్ఘ‌న్‌లో జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై మోదీకి అవ‌గాహ‌న లేదా అని రాహుల్ ప్ర‌శ్నించారు.

తాలిబన్లకు మరో షాక్, పంజ్‌షిర్ వద్ద సామాన్యులు తిరుగుబాటు, దాడిలో 300 మంది తాలిబన్ల హతమయ్యారని వార్తలు, అఫ్ఘానిస్థాన్‌లోని పంజ్‌షార్, కపిసా ప్రాంతంలో ఘర్షణలు

ఆఫ్ఘ‌న్‌లో చిక్కుకున్న భార‌తీయుల్ని ఎయిర్ ఇండియా, ఇండిగో, విస్తారా విమానాల్లో తీసుకువ‌చ్చారు. ప్ర‌తి రోజూ కాబూల్ నుంచి రెండు విమానాల‌ను న‌డుపుతున్నారు. ఆఫ్ఘ‌న్‌లో ఉన్న హిందువులు, సిక్కుల‌తో పాటు స్థానికుల‌కు కూడా హెల్ప్ చేయ‌నున్న‌ట్లు ప్ర‌భుత్వం వెల్ల‌డించింది.అప్ఘన్ నుంచి భారతీయుల తరలింపు మిషన్‌లో భాగంగా ఇంతవరకూ సుమారు 730 మందిని భారత ప్రభుత్వం వెనక్కి తీసుకువచ్చింది.

థర్డ్ వేవ్ భయానకం..త్వరలో ప్రతిరోజూ 4 నుంచి 5 లక్షల కరోనా కేసులు నమోదయ్యే అవకాశం, బెడ్లు సిద్ధం చేయాలని హెచ్చరించిన నీతి ఆయోగ్, దేశంలో తాజాగా 25,072 కొత్త కేసులు

అప్ఘనిస్థాన్‌‌లో (Taliban Afghan Conflict) చోటు చేసుకుంటున్న పరిణామాలపై రాజకీయ పార్టీలతో కేంద్ర ప్రభుత్వం చర్చించనుంది. ఇందుకోసం ఈనెల 26న వివిధ రాజకీయ పార్టీల పార్లమెంటరీ నేతలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయనుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి వివరిస్తారని ఆయన పేర్కొన్నారు. అఖిలపక్ష సమావేశంలో అప్ఘనిస్థాన్‌లో నివససిస్తున్న భారతీయులను స్వదేశానికి తరలించే అంశం, ఆ దేశ పరిస్థితిపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది.