Fungal infection mucormycosis | Representational Image (Photo Credits: Pixabay)

New Delhi, August 23: దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 25,072 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,24,49,306కు (Coronavirus in India) చేరింది. ఇందులో 3,16,80,626 మంది బాధితులు కోలుకోగా, మరో 4,34,756 మంది మహమ్మారికి బలయ్యారు. ఇక మొత్తం కేసుల్లో 3,33,924 కేసులు (COVID-19 Cases) యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, ఆదివారం ఉదయం నుంచి ఇప్పటివరకు కొత్తగా 44,157 మంది కోలుకోగా, 389 మంది కన్నుమూశారు.

కాగా, మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసుల సంఖ్య 1.2 శాతంగా ఉందని, 2020, మార్చి తర్వాత కరోనాతో చికిత్స పొందుతున్నవారి సంఖ్య ఇంత తక్కువగా ఉండటం ఇదే మొదటిసారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అదేవిధంగా రోజువారీ పాజిటివిటీ రేటు గత 28 రోజులుగా 3 శాతం కంటే తక్కువగానే ఉంటున్నదని వెల్లడించింది. రికవరీ రేటు 97.63 శాతానికి చేరిందని పేర్కొన్నది. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ ముమ్మరంగా కొనసాగుతున్నది.

గత 24 గంటల్లో 7,95,543 మందికి టీకా ఇచ్చామని ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం 58,25,49,595 డోసులను పంపిణీ చేశామని తెలిపింది. అదేవిధంగా ఆగస్టు 22న 12,95,160 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని ఐసీఎమ్మార్‌ ప్రకటించింది. దీంతో ఆదివారం వరకు మొత్తం 50,75,51,399 నమూనాలను పరీక్షించామని వెల్లడించింది.

పశ్చిమగోదావరి జిల్లాలో అత్యధికంగా 137 కేసులు, ఏపీలో కొత్తగా 1,085 మందికి కరోనా, తాజాగా 8 మంది మృతి, 1,541 మంది కోలుకుని డిశ్చార్జ్, రాష్ట్రంలో ప్రస్తుతం 14,677 యాక్టివ్‌ కేసులు

నీతి ఆయోగ్ (నేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా)తాజాగా కరోనా థర్డ్ వేవ్‌పై హెచ్చరికలు జారీ చేసింది. సెప్టెంబరులో ప్రతిరోజూ 4 నుంచి 5 లక్షల కరోనా కేసులు నమోదయ్యే అవకాశాలున్నాయని హెచ్చరించింది. అప్పుడు కరోనా బారిన పడిన ప్రతీ 100 మందిలో 23 మంది ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితులు ఏర్పడనున్నాయని అంచనా వేసింది. అందుకే ఈ పరిస్థితులకు ముందుగానే దేశంలో రెండు లక్షల ఐసీయూ బెడ్లు సిద్ధంగా ఉంచాలని సూచింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం... రానున్న కరోనా దుర్భర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ముందుగానే అప్రమత్తమవుతూ, వైద్య సదుపాయాలు సిద్ధం చేయాలని సూచింది.

2 లక్షల ఐసీయూ బెడ్లతో పాటు 1.2 లక్షల వెంటిలేటర్ కలిగిన ఐసీయూ బెడ్లు, 7 లక్షల ఆక్సిజన్ సిలిండర్లు కలిగిన బెడ్లు, 10 లక్షల కోవిడ్ ఐసోలేషన్ కేర్ బెడ్లు సిద్ధం చేయాలని సూచించింది. నీతి ఆయోగ్ దీనికి ముందుగా 2020 సెప్టెంబరులో కరోనా సెకెండ్ వేవ్ గురించి హెచ్చరించింది. ఈసారి కూడా థర్డ్ వేవ్ గురించి హెచ్చరికలు జారీ చేసింది.