AFSPA Extended in Nagaland: నాగాలాండ్ ప్రమాదకర ప్రాంతం, అక్కడ సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం అమలును మరో ఆరు నెలలు పొడిగించిన కేంద్ర హోంశాఖ

నాగాలాండ్‌ను ( Nagaland) కల్లోలిత ప్రాంతంగా కేంద్రం ప్రకటించింది. ఆ రాష్ట్రం ప్రమాదకరంగా (State Declared as a 'Disturbed Area') మారినట్లు ఇవాళ కేంద్రం తెలిపింది.

Representative Image

New Delhi, December 30: ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్ లో ఇటీవల వివాదాస్పదంగా మారిన సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం అమలును కేంద్రం తాజాగా మరో ఆరు నెలలు (AFSPA Extended in Nagaland) పొడిగించింది. నాగాలాండ్‌ను ( Nagaland) కల్లోలిత ప్రాంతంగా కేంద్రం ప్రకటించింది. ఆ రాష్ట్రం ప్రమాదకరంగా (State Declared as a 'Disturbed Area') మారినట్లు ఇవాళ కేంద్రం తెలిపింది.

డిసెంబర్ 30వ తేదీ నుంచి ఇది వర్తించనున్నట్లు స్పష్టం చేసింది. మరో వైపు సాయుధ దళాల ప్రత్యేక చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. నాగాలాండ్ నుంచి ప్రత్యేక సైనిక దళాల చట్టాన్ని ఉపసంహరించాలా వద్దా అన్న అంశంపై బుధవారం కేంద్ర ప్రభుత్వ ఉన్నత స్థాయి కమిటీ ఒకటి చర్చలు నిర్వహించింది.కానీ ప్రస్తుతం ఆ చట్టాన్ని కొనసాగించాలని ఆ కమిటీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కొన్ని దశాబ్ధాల నుంచి నాగాలాండ్‌లో ప్రత్యేక అధికారాలు కలిగిన ఆ చట్టం అమలులోనే ఉన్నది. ప్రమాదకరంగా మారిన నాగాలాండ్‌లో సైనిక దళాలతో పాటు స్థానిక పోలీసు బలగాల పహారా అవసరమని కేంద్రం అభిప్రాయపడింది.

అసలేం జరిగింది, నాగాలాండ్ కాల్పుల ఘటనపై నేడు ఉభయసభల్లో అమిత్ షా కీలక ప్రకటన, కూలీలపై జవాన్లు కాల్పులు జరిపిన ఘటనపై పార్లమెంట్‌లో ఆందోళన చేపట్టిన విపక్షాలు

ఇటీవల జరిగిన హింసాకాండలో 14 మంది పౌరులు చనిపోయిన విషయం తెలిసిందే. ఆ ఘటన తర్వాత మళ్లీ నాగాలాండ్‌లో ఆందోళనలు తారాస్థాయికి చేరాయి. ఎటువంటి అనుమతి లేకుండానే సెర్చ్ ఆపరేషన్ చేపట్టి, ఎవరినైనా అరెస్టు చేసే అధికారం ఏఎఫ్ఎస్‌పీఏ చట్టానికి ఉంది. దీంతో ఆ చట్టంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.

నాగాలాండ్ లో ఘోరం, తీవ్రవాదులు అనుకొని కూలీలపై కాల్పులు, 14 మంది మృతి, భద్రతా దళాల వాహనాలకు నిప్పు పెట్టిన స్థానికులు..

ఈ చట్టాన్ని రద్దు చేయాలంటూ నాగాలాండ్ అసెంబ్లీ డిసెంబర్ 21న ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ క్రమంలోనే కేంద్ర హోం శాఖ ఈ చట్టాన్ని మరో ఆరు నెలలు పొడిగించినట్లుగా నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలో వచ్చే ఏడాది జూన్ 30 వరకు ఈ చట్టం అమలులోకి రానుంది.