Bihar IAS Officer Condom Remark: ఇప్పుడు శానిటరీ ప్యాడ్స్ అడుగుతారు! రేపు కండోమ్స్ కావాలంటారు, బీహార్ ఐఏఎస్ అధికారి వివాదాస్పద కామెంట్స్, తీవ్రదుమారం రేపడంతో క్షమాపణలు చెప్పిన మహిళా ఐఏఎస్, చర్యలు తీసుకుంటామన్న సీఎం నితీష్

ఇప్పుడు మీరు శానిటరీ ప్యాడ్స్ (Sanitary pads) అడుగుతున్నారు.. రేపు కండోమ్స్ అండుతారు అంటూ ఆమె సమాధానం ఇచ్చింది. అయితే ఆమె వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో.. హర్జోత్ క్షమాపణలు చెప్పారు.

Image Credit @twitter

Patna, SEP 30: బీహార్ పాట్నాలో జరిగిన ఓ వర్క్‌షాప్‌లో బీహార్ మహిళా ఐఏఎస్ (IAS Officer) అధికారిని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ పాఠశాల విద్యార్థిని శానిటరీ ప్యాడ్‌లను (Sanitary pads) మరింత తక్కువ ధరకు అందుబాటులోకి తీసుకురావాలని అడగగా, వాటిని తక్కువ ధరకు ఇస్తే.. మీరు కండోమ్స్ (condoms) కూడా అడుగుతారు అంటూ ఐఏఎస్ అధికారిని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. సెప్టెంబర్ 27న జరిగిన ఈ కార్యక్రమంలో ఐఏఎస్ అధికారిని (IAS officer) చేసిన వ్యాఖ్యలను బీజేపీ కార్యకర్త సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో ఆమెపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో సదరు ఐఏఎస్ అధికారిని క్షమాపణలు చెప్పారు. బీహార్ ఐఏఎస్ అధికారిణి హర్జోత్ కౌర్ (Harjot Kaur Bhamra)  ఉమెన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తుంది.

యువతులకు శానిటరీ ప్యాడ్స్ ను అందుబాటు ధరల్లో ప్రభుత్వమే అందించడం జరుగుతుందా అని ఓ బాలిక ప్రశ్నించగా.. ఇప్పుడు మీరు శానిటరీ ప్యాడ్స్ (Sanitary pads) అడుగుతున్నారు.. రేపు కండోమ్స్ అండుతారు అంటూ ఆమె సమాధానం ఇచ్చింది. అయితే ఆమె వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో.. హర్జోత్ క్షమాపణలు చెప్పారు. నేను ఏ బాలిక సెంటిమెంట్లను కించపరిచి ఉంటే నన్ను క్షమించాలని, నేను ఎవరినీ అవమానపర్చేందుకు, ఎవరి మనోభావాలను కించపర్చాలన్న భావన నాకులేదని, తన మాటలకు ఎవరి మనోభావాలైనా గాయపడిఉంటే అందుకు తాను చింతిస్తున్నానని ట్విటర్ (Twitter) వేదికగా ఆమె పేర్కొన్నారు.

Blocking Porn Websites: మరో 67 పోర్న్ వెబ్‌ సైట్లపై కేంద్ర ప్రభుత్వం కొరడా, వాటిని వెంటనే నిలిపివేయాలంటూ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు లేఖ, ఉత్తరాఖండ్, పుణె కోర్టుల ఆదేశాల మేరకు వెంటనే చర్యలు తీసుకున్న ప్రభుత్వం 

ఇదిలాఉంటే.. జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేఖాశర్మ స్పందించారు.. కండోమ్స్ వ్యాఖ్యలపై ఏడు రోజుల్లోగా లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఐఏఎస్ అధికారి హర్జోత్ కౌర్ ను ఆదేశించారు. మరోవైపు బీహార్ (bihar) రాష్ట్రంలో తీవ్ర దుమారానికి దారితీసిన ఐఏఎస్ అధికారిని వ్యాఖ్యలపట్ల సీఎం నితీష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్పందించిన నితీష్.. హర్జోత్ కౌర్ పై చర్యలు తీసుకుంటామని, ఇటీవల స్కూల్ బాలిక ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాదానం సిగ్గుపడేదిలా ఉందని, ఈ ఘటనపై విచారణ జరపాలని ఆదేశాలు జారీ అయ్యాయని అన్నారు. ఆమెపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని సీఎం నితీష్ కుమార్ తెలిపారు.