New Delhi, SEP 29: పోర్న్ సైట్లపై (Porn sites) కేంద్ర ప్రభుత్వం మరోసారి కొరడా ఝులిపించింది. ఇప్పటికే పలు సైట్లపై నిషేదం విధించిన కేంద్రం, తాజాగా మరో 67 సైట్లను బ్లాక్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. 2021 నూతన ఐటీ రూల్స్ కు (IT Rules) విరుద్దంగా నడుస్తున్న ఈ సైట్లను నిషేదించాలని కోర్టులు ఆదేశాలు జారీ చేశాయి. దీంతో మేరకు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు (Internet providers) మార్గదర్శకాలు జారీ చేసింది. పుణే కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు 63 పోర్న్‌ సైట్లను బ్లాక్ చేస్తున్నట్లు, ఉత్తరాఖండ్ కోర్టు ఆదేశాల మేరకు 4 పోర్న్ సైట్లను బ్లాక్ చేయాలని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు  కేంద్ర టెలికాం శాఖ లేఖ రాసింది. గతంలో కూడా వందల సంఖ్యలో పోర్న్ సైట్లను నిషేదిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కానీ కొత్త సైట్లు పుట్టుకొస్తుండటంతో వాటిపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)