Tamil Nadu: అధికార పార్టీ పెట్టిన బిర్యానీ తిని 100 మందికి అస్వ‌స్థ‌త‌, ప‌లువురి ప‌రిస్థితి విష‌మం, పాడైపోయిన బిర్యానీ వ‌ల్ల‌నే అన‌ర్ధం

ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న డీఎంకే (DMK) శుక్రవారం పార్టీ కార్యక్రమం నిర్వహించింది. ఆ పార్టీ నేతలు ఈ సందర్భంగా కొందరు లబ్ధిదారులకు సంక్షేమ సామగ్రిని పంపిణీ చేశారు. అనంతరం పార్టీ కార్యక్రమానికి హాజరైన వారికి బిర్యానీ ప్యాకెట్లు (Biryani) పంపిణీ చేశారు. కొందరు అక్కడే బిర్యానీ తినగా, మరి కొందరు తమ ఇళ్లకు పట్టుకెళ్లారు.

Biryani (Credits: X)

Chennai, SEP 14:  ఒక పార్టీ కార్యక్రమంలో బిర్యానీ పంపిణీ చేశారు. అది తిన్న తర్వాత సుమారు 40 మంది పిల్లలతో సహా వంద మందికిపైగా వ్యక్తులు అస్వస్థతకు గురయ్యారు. (people fall ill) వారిని వెంటనే పలు ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. తమిళనాడులోని మదురై జిల్లాలో (Madhurai) ఈ సంఘటన జరిగింది. ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న డీఎంకే (DMK) శుక్రవారం పార్టీ కార్యక్రమం నిర్వహించింది. ఆ పార్టీ నేతలు ఈ సందర్భంగా కొందరు లబ్ధిదారులకు సంక్షేమ సామగ్రిని పంపిణీ చేశారు. అనంతరం పార్టీ కార్యక్రమానికి హాజరైన వారికి బిర్యానీ ప్యాకెట్లు (Biryani) పంపిణీ చేశారు. కొందరు అక్కడే బిర్యానీ తినగా, మరి కొందరు తమ ఇళ్లకు పట్టుకెళ్లారు.

Ganja Seize In Hyderabad: 170 కేజీల గంజాయిని సీజ్‌ చేసిన ఎక్సైజ్ పోలీసులు, రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్‌పేట వద్ద పట్టుకున్న పోలీసులు..వీడియో 

కాగా, బిర్యానీ తిన్న కొద్దిసేపటికే వంద మందికిపైగా వాంతులు, వికారం వంటి లక్షణాలతో అస్వస్థతకు (Fall Ill) గురయ్యారు. వీరిలో 40 మంది పిల్లలు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో వారిని వెంటనే విల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. బాధిత వ్యక్తుల సంఖ్య పెరుగడంతో పది అంబులెన్స్‌లను రప్పించారు. బిర్యానీ తిని అనారోగ్యం పాలైన వారిని విరుదునగర్, కల్లికుడిలోని ఆరోగ్య కేంద్రాలకు తరలించారు.

Health Tips: మీ ఇంట్లో బొద్దింకలు ఎక్కువగా ఉన్నాయా..అయితే వాటిని ఎలా తరిమేయాలో తెలుసా. 

మరోవైపు డీఎంకే పార్టీ కార్యక్రమంలో పంపిణీ చేసిన బిర్యానీ పాడైందని, దీంతో అది తిన్న వారికి ఫుడ్ పాయిజన్ అయ్యిందని డాక్టర్లు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న తిరుమంగళం పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టారు. పాడైన బిర్యానీ సరఫరా చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif