Ahmedabad Shocker: పోలీసా..లేక కామాంధుడా, ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళపై పలుమార్లు అత్యాచారం, గుజరాత్‌లో దారుణ ఘటన, కర్ణాటకలో మూత్ర విసర్జన కోసం బయటకు వచ్చిన మహిళపై లైంగిక దాడికి పాల్పడిన మరో కానిస్టేబుల్
వరకట్నవేధింపులపై ఫిర్యాదు చేసేందుకు (dowry complaint) పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఓ మహిళపై కానిస్టేబుల్ అదేపనిగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెను లోబరుచుకుని పెండ్లి పేరుతో పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారని బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Ahmedabad, July 17: గుజరాత్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. వరకట్నవేధింపులపై ఫిర్యాదు చేసేందుకు (dowry complaint) పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఓ మహిళపై కానిస్టేబుల్ అదేపనిగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెను లోబరుచుకుని పెండ్లి పేరుతో పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారని బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళ(38)పై లైంగిక దాడికి పాల్పడిన అభియోగాలతో కానిస్టేబుల్‌పై (Gujarat Police constable) కేసు నమోదు చేశారు.
వివరాల్లోకెళితే.. గుజరాత్ లోని అహమ్మదాబాద్ కు చెందిన ఓ మహిళ..తన మాజీ భర్తపై వరకట్న వేధింపులకు పాల్పడినందుకు కేసు నమోదు చేసేందుకు స్టేషన్ కు వెళ్లింది. అక్కడి కానిస్టేబుల్‌ను కేసు కోసం ఆశ్రయించగా నిందితుడిపై కఠిన చర్యలు చేపడతానని భరోసా ఇచ్చాడని, ఆపై తనను పెండ్లి చేసుకుంటానని చెప్పి మూడేండ్లుగా పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది.
సెటిల్‌మెంట్ కోసం తనను కానిస్టేబుల్ డబ్బులు డిమాండ్ చేయగా ఈ ఏడాది మేలో నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశానని ఆమె చెప్పారు. నిందితుడు తనను అహ్మదాబాద్‌లోని హోటల్‌లో గడపాలని కూడా ఒత్తిడి తెచ్చాడని, హోటల్‌లోనూ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆమె ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు తనపై దాడి చేశాడని బాధిత మహిళ కానిస్టేబుల్‌పై ఫిర్యాదు చేశారు. మహిళను మోసగించి లైంగిక దాడికి (repeatedly raped by cop) పాల్పడటంపై పోలీసులు కానిస్టేబుల్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఇక కర్ణాటకలో మహిళలకు రక్షణగా ఉండాల్సిన ఓ పోలీస్ క్రమశిక్షణ తప్పాడు. మూత్ర విసర్జన కోసం బయటకు వచ్చిన మహిళపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మైసూరు నగరంలో చోటుచేసుకుంది. నగరంలోని మెటగళ్లి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ మహబూబ్‌పై బాధితురాలు ఫిర్యాదు చేసింది. పోలీసుల వివరాల మేరకు... మైసూరు నగరంలోని రాఘవేంద్ర నగర్లో కానిస్టేబుల్ మహబూబ్ నివాసం ఉంటున్నాడు.
ఇతని ఇంటి పక్కనే ఉంటున్న ఓ మహిళ ఈనెల 13న అర్ధరాత్రి సమయంలో మూత్ర విసర్జన కోసం వచ్చింది. ఆమెపై కన్నేసిన మహబూబ్ ఆమె వెనుకాలే వెళ్లి గట్టిగా పట్టుకుని ఇంటిలోకి లాక్కెళ్లాడు. ఈ క్రమంలో ఆమె గట్టిగా కేకలు వేయడంతో ఇంటిలో ఉన్న మరోవ్యక్తి అడ్డుకోవడానికి యత్నించాడు. పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో మహబూబ్ అక్కడి నుంచి పారిపోయాడు. నజరాబాద్ పోలీసు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గతంలో కూడా ఇతనిపై పలు ఆరోపణలు ఉన్నాయి.