Amit Shah Health Update: మళ్లీ ఆస్పత్రిలో చేరిన అమిత్ షా, శ్వాస సంబంధ సమస్యలతో ఎయిమ్స్‌లో చేరిన కేంద్ర హోం మంత్రి, కార్డియో న్యూరో టవర్‌లో అడ్మిట్
దీంతో తిరిగి ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(ఎయిమ్స్)లో చేరారు. శనివారం రాత్రి సుమారు 11 గంటలకు షా ఎయిమ్స్‌లోని కార్డియో న్యూరో టవర్‌లో అడ్మిట్ అయ్యారు. వీవీఐపీల కేటాయించిన సీఎస్ టవర్‌లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. కరోనా నుంచి కోలుకున్న తరువాత కూడా అమిత్ షా శ్వాస సంబంధిత సమస్యలతో (Amit Shah Health Update) బాధపడుతున్నట్లు సమాచారం. దీనికి ముందు కూడా షా పోస్ట్- కోవిడ్ ట్రీట్‌మెంట్ కోసం ఎయిమ్స్‌లో చేరారు.
New Delhi, September 13: ఇటీవలే కరోనా నుంచి శ్వాస సంబంధిత వ్యాధి నుంచి కోలుకున్న కేంద్ర మంత్రి అమిత్‌షా (Union Home Minister Amit Shah) మరోమారు అనారోగ్యం బారిన పడ్డారు. దీంతో తిరిగి ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(ఎయిమ్స్)లో చేరారు. శనివారం రాత్రి సుమారు 11 గంటలకు షా ఎయిమ్స్‌లోని కార్డియో న్యూరో టవర్‌లో అడ్మిట్ అయ్యారు.
వీవీఐపీల కేటాయించిన సీఎస్ టవర్‌లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. కరోనా నుంచి కోలుకున్న తరువాత కూడా అమిత్ షా శ్వాస సంబంధిత సమస్యలతో (Amit Shah Health Update) బాధపడుతున్నట్లు సమాచారం. దీనికి ముందు కూడా షా పోస్ట్- కోవిడ్ ట్రీట్‌మెంట్ కోసం ఎయిమ్స్‌లో చేరారు.
ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా ఆధ్వర్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్య బృందాలు పర్యవేక్షిస్తున్నాయి. అతని పరిస్థితి నిలకడగానే ఉందని ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి. ఆగస్టు 2న కరోనా (COVID 19) బారినపడిన అమిత్ షా గురుగ్రామ్‌లోని మేదాంత హాస్పటల్‌లో చికిత్స పొందారు.
14వ తేదీన ఆయనకు నెగిటివ్ రాగా.. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ క్రమంలో హోం ఐసోలేషన్‌లో ఉన్న అమిత్ షాకు శ్వాసకోశ సమస్య, ఇతర అనారోగ్య పరిస్థితలు తలెత్తడంతో 18న తిరిగి ఎయిమ్స్‌లో చేరారు. ఆగస్టు 31న ఆయన అక్కడి నుంచి డిశ్చార్జి అయిన సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా అమిత్ షా ఆసుపత్రి నుంచే తన మంత్రిత్వశాఖ పనులను నిర్వహించారు.