Andhra Pradesh: వైసీపీ వాళ్లు ఎవరైనా మాట్లాడితే బొక్కలో వేస్తాం, పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు, జగన్ ప్రభుత్వంలో ఎమ్మార్వో ఆఫీసులనే తాకట్టు పెట్టారని చంద్రబాబు మండిపాటు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ శ్రీకాకుళం జిల్లా ఈదుపురంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం (దీపం-2) ప్రారంభించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ... అస్తవ్యస్తంగా మారిన రాష్ట్రాన్ని అందరం కలిసి పోరాడి కాపాడుకున్నామని అన్నారు. ఆడబిడ్డల కోసం ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు.

Chandrababu and Jagan and Pawan Kalyan (Photo-File Image)

Vjy, Nov 1: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ శ్రీకాకుళం జిల్లా ఈదుపురంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం (దీపం-2) ప్రారంభించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ... అస్తవ్యస్తంగా మారిన రాష్ట్రాన్ని అందరం కలిసి పోరాడి కాపాడుకున్నామని అన్నారు. ఆడబిడ్డల కోసం ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. ఇంటిని సమర్థంగా నడిపించే శక్తి ఆడబిడ్డలకు ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 50 శాతం మంది ఆడబిడ్డలు ఉన్నారని, వారంతా ఆత్మగౌరవంతో బతకాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు.

నాడు రాజకీయాల్లో మహిళలకు ఎన్టీఆర్ రిజర్వేషన్లు తీసుకువచ్చారని వెల్లడించారు. మహిళల్లో శక్తిసామర్థ్యాలకు కొదవలేదని, అందుకే నాడు డ్వాక్రా సంఘాలు తీసుకువచ్చామని చెప్పారు. దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు ఇచ్చామని, అప్పట్లోనే 59 లక్షల గ్యాస్ సిలిండర్లు ఇచ్చామని వివరించారు.

ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ఎవరూ అపోహ పెట్టుకోవద్దని స్పష్టం చేశారు. గ్యాస్ సిలిండర్ కు చెల్లించిన డబ్బు 48 గంటల్లోనే లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రిఫండ్ అవుతుందని వెల్లడించారు. మున్ముందు గ్యాస్ సిలిండర్ కు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేకుండా చూస్తామని అన్నారు. ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ పథకాలు అమలు చేస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు.

వీడియో ఇదిగో, స్వయంగా టీ చేసి మహిళా లబ్ధిదారుకి అందించిన సీఎం చంద్రబాబు, ఏపీలో ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ పథకం ప్రారంభం

రాష్ట్రంలో 64 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామని, అందుకోసం రూ.2,729 కోట్లు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. అన్ని రాష్ట్రాల కంటే మనమే ఎక్కువ పింఛను ఇస్తున్నామని అన్నారు. అంతేగాకుండా, పింఛను మొత్తాన్ని మూడు నెలలకు ఒకసారి కూడా తీసుకోవచ్చని చెప్పారు. పెన్షన్ ఎవరు ఆపినా నిలదీయండి... పెన్షన్ మీ హక్కు అని చంద్రబాబు ఉద్ఘాటించారు. పెన్షన్ డబ్బును ఇంటి వద్దే గౌరవంగా ఇవ్వాలని ఆదేశించానని తెలిపారు.

గతంలో కేంద్రం ఇచ్చిన నిధులను వైసీపీ ప్రభుత్వం దారిమళ్లించిందని చంద్రబాబు ఆరోపించారు. ప్రభుత్వంలో ఉన్న వారు జవాబుదారీతనంతో ఉండాలని, కానీ వైసీపీ హయాంలో ఉన్నతాధికారులను బెదిరించిన దాఖలాలు చూశామని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మార్వో ఆఫీసులనే తాకట్టు పెట్టారని మండిపడ్డారు.

Pawan Kalyan Fire on YCP

Chandrababu Speech

తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం, ఇసుక విధానాలను ప్రక్షాళన చేశామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఉచిత ఇసుక విధానంలో జోక్యం చేసుకోవద్దని ఇంతకుముందే చెప్పానని, ఇసుకలో అక్రమాలకు పాల్పడితే పీడీ చట్టం కింద అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో నాసిరకం మద్యం ఉండదు, బెల్టు షాపులు ఉండవు అని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టులో కొత్త డయాఫ్రం వాల్ నిర్మిస్తున్నామని తెలిపారు.

ఉచిత సిలిండర్ పథకం అమల్లోకి, మూడు సిలిండర్లు ఎప్పుడెప్పుడు బుక్ చేసుకోవాలో తెలుసుకోండి

ఇక, విశాఖ ఉక్కు పరిశ్రమను పరిరక్షిస్తామని హామీ ఇచ్చామని, ఆ దిశగా తమ కృషి ఫలిస్తోందని చెప్పారు. విశాఖ రైల్వే జోన్ కు మార్గం సుగమం చేశామని, విశాఖ రైల్వే జోన్ కు రేపో, ఎల్లుండో భూమిపూజ జరుగుతుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. టెక్కలి లేదా పలాసతో ఎయిర్ పోర్టు నిర్మాణం చేపడతామని, మూలపేటలో 10 వేల ఎకరాలతో ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మిస్తామని వెల్లడించారు.

రాష్ట్రంలో అర్హులైన వారందరికీ ఇళ్లు, రేషన్ కార్డులు, పెన్షన్లు అందజేస్తామని తెలిపారు. నిరుద్యోగ యువత కోసం మెగా డీఎస్సీ ప్రకటించామని, భారీ ఎత్తున పరిశ్రమలు తీసుకువచ్చేందుకు శ్రమిస్తున్నామని చెప్పారు. ఆకాశమే హద్దుగా యువతను ప్రోత్సహిస్తామని, అదే సమయంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే వారు కూడా ముందుకు రావాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇక, రేపటి నుంచి రాష్ట్రంలో రోడ్ల గుంతలు పూడ్చే కార్యక్రమం చేపడుతున్నామని అన్నారు.

మాది పగ ప్రతీకారాల ప్రభుత్వం కాదు: పవన్ కళ్యాణ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏలూరు జిల్లా ఐఎస్ జగన్నాథపురం గ్రామంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తన ప్రసంగంలో వైసీపీని ఏకిపడేశారు. ఈవీఎం మిషన్లు మోసం చేశాయట... వీళ్లకి 151 సీట్లు వచ్చినప్పుడు ఈవీఎంలు మోసం చేయలేదు... ఇప్పుడు 11 సీట్లే వచ్చేసరికి ఈవీంఎలు మోసం చేశాయంటున్నారు అని మండిపడ్డారు. "అన్నా... మోసం జరిగింది క్షమించు" అంటూ మళ్లీ దానిపై పాటలు కూడా...! అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. ఓడిపోయిన మూడ్నాలుగు నెలలకే డ్రామాలు, మెలోడ్రామాలకు తెరలేపారని పవన్ కల్యాణ్ విమర్శించారు.

ఇది పగ ప్రతీకారాల ప్రభుత్వం కాదని తాము గెలిచిన రోజునే చెప్పానని వెల్లడించారు. గత నాలుగు నెలలుగా తాను ఒక్క మాట కూడా మాట్లాడలేదని, కానీ అవతలి వాళ్లకు నోళ్లు ఎక్కువయ్యాయని మండిపడ్డారు. ఇది మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదని స్పష్టం చేశారు. ఓడిపోయి 11 సీట్లకే పరిమితమైనా వైసీపీ వాళ్ల నోళ్లు మూతపడడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇటీవల నన్ను అడుగుతున్నారు... ఏంటన్నా మెత్తబడిపోయావు, మంచివాడివైపోయావు అంటున్నారు... నిజమే, నేనెప్పుడూ మంచివాడినే... ఎవరి జోలికి వెళ్లను అని వ్యాఖ్యానించారు.

వైసీపీ వాళ్లకు ఇంకా తిమ్మిరి తిమ్మిరిగానే ఉందని అన్నారు. ప్రతి వైసీసీ సోషల్ మీడియా హ్యాండిల్ పై నిశిత పర్యవేక్షణ ఉంటుందని హెచ్చరించారు. మీరు చేసే ప్రతి వ్యాఖ్యను టైమ్ స్టాంప్ తో సహా, ఎవడు ఏం మాట్లాడుతున్నాడు, ఆడబిడ్డలపై ఎలాంటి దూషణలకు పాల్పడుతున్నాడు, టీవీల్లో ఏం మాట్లాడుతున్నారు... ఇలా అన్నింటికీ ఆధారాలు ఉన్నాయి అని పవన్ స్పష్టం చేశారు.

సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ఆడబిడ్డలపై నీచంగా మాట్లాడుతున్నారు... అందరినీ గుర్తిస్తున్నాం... ఎవరూ ఎక్కడికీ పోలేరు... ఇలాంటి వాళ్ల కోసమే డిజిటల్ ప్రైవసీ చట్టం వస్తోంది... అది ఎలా పనిచేస్తుందో ఈలోపే మీకు చూపిస్తాం... ఎవరు తప్పు చేసినా వారిపై క్రిమినల్ రికార్డు ఉంటుంది.... అందుకే, ముందుగా చెబుతున్నాను అంటూ వివరించారు.

వైసీపీ వాళ్లకు చింత చచ్చినా పులుపు చావలేదు... భవిష్యత్తులో నోట మాట రాకుండా చేస్తాం... మళ్లీ పాత పద్ధతుల్లో కుటుంబ సభ్యులను ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో తిట్టేస్తాం అంటే ఇక కుదరదు... ఏది పడితే అది మాట్లాడుతాం అంటే నేను మీకు మాటిస్తున్నా... లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టు... మీ సంగతి చూసే బాధ్యత నాది అని పవన్ ఘాటుగా హెచ్చరించారు. మేం ఏనాడూ మీ ఇంటి ఆడబిడ్డల గురించి అన్యాయంగా మాట్లాడలేదు అని స్పష్టం చేశారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now