IPL Auction 2025 Live

Andhra Pradesh: ఏపీలో నేటి నుంచి చెత్త ప‌న్ను రద్దు, స్వచ్చ ఆంధ్రప్రదేశ్‌గా రాష్ట్రం తయారు కావాలని సీఎం చంద్రబాబు పిలుపు

ఈ మేర‌కు అధికారుల‌ను ఎక్క‌డా ప్ర‌జ‌ల నుంచి చెత్త ప‌న్ను వ‌సూలు చేయ‌రాద‌ని ఆదేశించారు.

Andhra Pradesh CM Chandrababu announces abolition of Garbage Tax, Promotes Cleanliness in State (X)

Vjy, Oct 2: ఏపీలో నేటి నుంచి రాష్ట్ర‌వ్యాప్తంగా చెత్త ప‌న్ను రద్దు (abolition of Garbage Tax) చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ మేర‌కు అధికారుల‌ను ఎక్క‌డా ప్ర‌జ‌ల నుంచి చెత్త ప‌న్ను వ‌సూలు చేయ‌రాద‌ని ఆదేశించారు. కృష్ణా జిల్లా మ‌చిలీప‌ట్నంలో ప‌ర్య‌టించిన చంద్ర‌బాబు.. గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా ఇక్క‌డ నిర్వ‌హించిన స్వ‌చ్ఛ‌తా హీ సేవ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి (Andhra Pradesh CM Chandrababu) మాట్లాడుతూ... "రాష్ట్రంలో 2019లో వచ్చిన వైసీపీ ప్ర‌భుత్వం వ్య‌వ‌స్థ‌ల‌ను అస్త‌వ్య‌స్తం చేసింది. రోడ్ల‌పై 85 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల చెత్త పేరుకుపోయింది. ఏడాది లోపు ఆ చెత్త మొత్తం క్లీన్ చేయించాల‌ని మంత్రి నారాయ‌ణ‌ను ఆదేశించాం. 2029 నాటికి ఈ ల‌క్ష్యాన్ని చేరుకోవాలి.

మేము అధికారంలోకి వస్తాం,కూటమి నేతలు సంగతి అప్పుడు తేలుస్తాం, వైఎస్ అవినాశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ప్ర‌జ‌లు ఆరోగ్యంగా ఉన్నారంటే దానికి కార‌ణం స్వ‌చ్ఛ సేవ‌కులే. ప్ర‌తి ఒక్క‌రూ స్వ‌చ్ఛ సేవ‌కులు కావాలి. కొంద‌రు స్వార్థప‌రులు ఆంధ్ర జాతీయ క‌ళాశాల‌ను ఆక్ర‌మించారు. స‌ర్కార్ దాన్ని స్వాధీనం చేసుకుంటుంది. జాతీయ ప‌తాకం రూప‌క‌ర్త పింగ‌ళి వెంక‌య్య పేరు మీద వైద్య క‌ళాశాల ఏర్పాటు చేస్తాం. అక్టోబ‌ర్ 2, 2014లో స్వ‌చ్ఛ భార‌త్‌కు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ స్వీకారం చుట్టారు. ఇది ఎంతో గొప్ప కార్య‌క్ర‌మం. దీనికి అంద‌రం ప్ర‌ధానికి అభినంద‌నలు తెలియ‌జేయాలి. మ‌న ప‌రిస‌రాలు శుభ్రంగా ఉంటేనే... మ‌నం ఆరోగ్యంగా ఉంటాం. బాపూజీ స్ఫూర్తితోనే స్వ‌చ్ఛ భార‌త్ కార్య‌క్ర‌మం తీసుకురావ‌డం జ‌రిగింది.

నీతి ఆయోగ్‌లో స్వ‌చ్ఛ భార‌త్‌పై ఉప‌సంఘం ఏర్పాటు చేశారు. దీనికి ఛైర్మ‌న్‌గా ఉన్నాను. 2 ల‌క్ష‌లకు పైగా వ్య‌క్తిగ‌త మ‌రుగుదొడ్ల నిర్మాణంతో ఏపీని ఓడీఎఫ్ రాష్ట్రంగా మార్చాం. చెత్త నుంచి సంప‌ద సృష్టించే కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టాను" అని చంద్ర‌బాబు తెలిపారు. గాంధీ జయంతిన 2029 కి ఏపీ స్వచ్చ ఆంధ్రప్రదేశ్‌గా తయారు కావాలని మనం సంకల్పం చేయాలి’’ అంటూ సీఎం పిలుపునిచ్చారు.



సంబంధిత వార్తలు

Eknath Shinde Resign: మహారాష్ట్ర సీఎం పదవికి ఏక్‌నాథ్‌ షిండే రాజీనామా, గవర్నర్‌కు రాజీనామా సమర్పించిన షిండే...సీఎం ఎవరన్నది ఇంకా సస్పెన్సే!

Deputy CM Pawan Kalyan: కేంద్రమంత్రి షెకావత్‌తో డిప్యూటీ సీఎం పవన్ భేటీ, టూరిజం హబ్‌గా ఏపీ..కేంద్రం సాయంతో పలు పర్యాటక ప్రాజెక్టులు రాబోతున్నాయని వెల్లడించిన పవన్ కళ్యాణ్

Constitution Day of India: 75వ రాజ్యాంగ దినోత్సవం, ప్రాథమిక హక్కులు- భారత పౌరులకు అందించిన గొప్ప వరం, ప్రజాస్వామ్యానికి మూలస్తంభంలా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ

RBI Governor Shaktikanta Das in Hospital: ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ కు అస్వస్థత.. చెన్నైలోని అపోలో దవాఖానలో చికిత్స.. ఛాతీలో నొప్పి కారణంగానేనంటూ మీడియాలో కథనాలు