Andhra Pradesh: సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ భేటీలో కీలక అంశాలు చర్చకు, కాకినాడ పోర్ట్‌లో రేషన్ బియ్యం కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోమవారం అమరావతిలో భేటీ అయ్యారు.ఉండవల్లిలోని సీఎం నివాసంలోదాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు

Andhra Pradesh CM Chandrababu Naidu and Deputy CM Pawan Kalyan Meeting

Vjy, Dec 2: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోమవారం అమరావతిలో భేటీ అయ్యారు.ఉండవల్లిలోని సీఎం నివాసంలోదాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. కాకినాడ పోర్ట్‌లో రేషన్ బియ్యం కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.

విభజనకు సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న పెండింగ్ అంశాలపై నేడు ఏపీ, తెలంగాణ అధికారుల భేటీ

అలాగే రాజధాని అమరావతిలో చేపట్టబోయే అభివృద్ధి పనులపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చర్చించారు. డిసెంబర్ 15వ తేదీ నుంచి అమరావతి పనులను వేగవంతం చేయాలని ఈ సందర్భంగా వారు నిర్ణయించారు. అలాగే తాజా రాజకీయ పరిణామాలు, రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక, తన ఢిల్లీ పర్యటన విశేషాలు, సోషల్‌ మీడియా కేసులు, నామినేటెడ్‌ పదవుల అంశాలపై చర్చించినట్లు సమాచారం.ఇక సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు ఇటీవల మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఆయన మృతి పట్ల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు.



సంబంధిత వార్తలు

Love Betrayal in MP: చనిపోదామని నిర్ణయించుకున్న ప్రేమికులు, ప్రియురాలిని తుపాకీతో కాల్చిన తరువాత మనసు మార్చుకున్న ప్రియుడు, చివరకు ఏమైందంటే..

Cyclone Fengal Update: తీరం దాటినా కొనసాగుతున్న ఫెంగల్ తుఫాను ఎఫెక్ట్, నాలుగు దక్షిణాది రాష్ట్రాలకు భారీ వర్ష సూచన, కేరళ వెళ్లే అయ్యప్ప భక్తులకు కీలక అలర్ట్

Andhra Pradesh: సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ భేటీలో కీలక అంశాలు చర్చకు, కాకినాడ పోర్ట్‌లో రేషన్ బియ్యం కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చ

Telangana: కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు ఉద్యోగాలు ఊడితేనే యువతకు ఉద్యోగాలు వచ్చాయి, గ్రూప్ -1 ఉద్యోగుల పాపం మీదేనని బీఆర్ఎస్ మీద మండిపడిన సీఎం రేవంత్ రెడ్డి