Father Kills Two Daughters: ఇద్దరు కూతుళ్లని తండ్రి చంపేశాడు, కడప జిల్లాలో దారుణ ఘటన, బావిలో నుంచి మృతదేహాలను వెలికి తీసిన పోలీసులు, పరారీలో నిందితుడు

ఓ కసాయి తండ్రి ఇద్దరు కూతుళ్లను బావిలోకి తోసి (Father Kills Two Daughters) చంపేశాడు. అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేయాల్సిన ఆ తండ్రి పిల్లల్ని చంపేయడంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.

Representational Image (Photo Credits: ANI)

Amaravathi, Febuary 29: ఏపీలోని వైయస్సార్ కడప (YSR Kadapa) జిల్లా గోపవరం మండలం శ్రీనివాసపురంలో ఘోరం జరిగింది. ఓ కసాయి తండ్రి ఇద్దరు కూతుళ్లను బావిలోకి తోసి (Father Kills Two Daughters) చంపేశాడు. అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేయాల్సిన ఆ తండ్రి పిల్లల్ని చంపేయడంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.

వివాహేతర సంబంధం చిచ్చు, భర్తను చంపేందుకు మటన్‌లో సైనేడ్ కలిపిన భార్య

స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు కడప జిల్లాలో (Kadapa) నివాసం ఉంటున్న తాళ్ల బాలకొండయ్య, బుజ్జమ్మలకు భావన (11), శోభన (9) ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. భర్త వేధింపులు తట్టుకోలేక బుజ్జమ్మ 5 సంవత్సరాల క్రితమే ఉరి వేసుకుని చనిపోయింది.

దీంతో అప్పటి నుంచి బిడ్డల ఆలనాపాలనా చూసేవారెవరూ లేరు. భార్య చనిపోవడంతో ఇద్దరు పిల్లల ఆలనాపాలన చూసుకునేందుకు బాలకొండయ్య తన తల్లిదండ్రులను ఇంటిలో ఉంచుకున్నాడు.

స్థానిక పాఠశాలలో పెద్ద కుమార్తె భావన 5వ తరగతి, రెండవ కుమార్తె శోభన 3వ తరగతి చదువుతున్నారు. అయితే పిల్లలిద్దరిని తండ్రి బాగానే చూసుకుంటుండేవాడని స్థానికులు తెలిపారు. తనకున్న రెండు ఎకరాల భూమిని సాగు చేసుకుంటూ మరో మినీ ట్రాన్స్‌పోర్ట్‌ వాహనాన్ని కూడా అతను బాడుగల కోసం తిప్పుకుంటున్నాడు.

అదనపు కట్నం కోసం కట్టుకున్న భార్యను చంపిన బ్యాంక్ మేనేజర్

గురువారం పిల్లలిద్దరినీ బయటకు తీసుకువెళుతానని చెప్పి బావిలో తోసి వెళ్లిపోయాడు. పిల్లలు ఇంటికి తిరిగి రాకపోవడంతో రాత్రంతా కుటుంబ సభ్యులతో పాటు బంధువులు గాలించారు. శుక్రవారం ఉదయం పొలం వద్దకు వెళుతుండగా రోడ్డు పక్కనే ఉన్న బావిలో పెద్ద కుమార్తె భావన శవమై ఉండటాన్ని గుర్తించారు.

వారు హుటాహుటిన గ్రామంలోకి వెళ్లి సమాచారం చేరవేశారు. పోలీసులకు సమాచారమిచ్చారు. ఫైర్‌ సిబ్బంది, పోలీసులతో పాటు స్థానికులు బావి వద్దకు చేరుకుని భావన శవాన్ని బయటకు తీశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు

అయితే ఇద్దరు పిల్లలతో పాటు తండ్రి కూడా బావిలో దూకి చనిపోయి ఉంటారని అందరూ అనుమానించారు. ఫైర్‌ సిబ్బంది, పోలీసులు వారి కోసం మరింత గాలించగా... గోనె సంచిలో కుక్కి ఉన్న చిన్న కుమార్తె శోభన మృతదేహం శనివారం ఉదయం బావిలో బయటపడింది. తండ్రి బాలకొండయ్య ఆచూకీ దొరకలేదు.

ఇదిలా ఉంటే బాలకొండయ్య నెల్లూరు జిల్లా సీతారామపురంలో ఉన్నట్లు అక్కడి బంధువొకరు సమాచారమిచ్చారు. పోరుమామిళ్ల నుంచి టేకూరుపేట మీదుగా బాలకొండయ్య బైకులో వెళుతున్నట్లు సీసీపుటేజ్‌ ద్వారా పోలీసులు గుర్తించారు. అతని కోసం గాలిస్తున్నారు. అభం శుభం తెలియని చిన్నారులు చనిపోవడంతో.. గ్రామంలో ఒక్కసారిగా విషాదం నెలకొంది.