Merugu Nagarjuna Case: మేరుగు నాగార్జున కేసులో ఫిర్యాదుదారుకి హైకోర్ట్ షాక్, తప్పుడు కేసు పెట్టినట్లు తేలితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాలని హెచ్చరిక, విచారణ 12కి వాయిదా

త‌న‌పై ఆయ‌న ఎలాంటి దాడి చేయ‌లేద‌ని, కొంద‌రు రాజ‌కీయ నేత‌ల ఒత్తిడితోనే ఫిర్యాదు చేసిన‌ట్లు బాధితురాలు హైకోర్టుకి (Andhra Pradesh high court) నివేదించారు.

Former Andhra Minister Merugu Nagarjuna Booked In Sexual Harassment Case

Vjy, Nov 7:వైసీపీ మాజీ మంత్రి మేరుగు నాగార్జున‌పై న‌మోదైన లైంగిక వేధింపుల‌ కేసులో ఊహించ‌ని ట్విస్ట్ చోటుచేసుకుంది. త‌న‌పై ఆయ‌న ఎలాంటి దాడి చేయ‌లేద‌ని, కొంద‌రు రాజ‌కీయ నేత‌ల ఒత్తిడితోనే ఫిర్యాదు చేసిన‌ట్లు బాధితురాలు హైకోర్టుకి (Andhra Pradesh high court) నివేదించారు. కేసును ఉప‌సంహ‌రించుకుంటున్నాన‌ని ప్ర‌మాణ‌ప‌త్రం దాఖ‌లు చేశారు.

తనపైన ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో తాడేపల్లి పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ మాజీ మంత్రి మేరుగు నాగార్జున దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. విచారణ సందర్భంగా తనకు, మేరుగు నాగార్జునకి ఎటువంటి సంబంధం లేదంటూ ఆ మహిళ కోర్టులో ప్రమాణ పత్రం దాఖలు చేసింది.

నేను ఏ టెస్టులకైనా సిద్ధమంటూ మెరుగు నాగార్జున సవాల్, మహిళ తనపై చేసిన అత్యాచారం ఆరోపణలను ఖండించిన వైసీపీ నేత, వీడియో ఇదిగో..

తనను కొంతమంది భయపెట్టడం వల్లే మేరుగ నాగార్జునపైన తప్పుడు కేసు పెట్టానని (woman withdraws rape charge against former minister) పద్మావతి స్పష్టం చేసింది. తనపై ఆయన ఎలాంటి దాడి చేయలేదని ఆమె పేర్కొంది. తాను ఆయనకు డబ్బులు ఇవ్వలేదు. కొంతమంది రాజకీయం కోసం నన్ను పావుగా వాడుకున్నారు. కొన్ని ఒత్తిళ్లు, అయోమయానికి గురై తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టాల్సి వచ్చింది. మూడు రోజుల క్రితమే ఈ విషయాన్ని తాడేపల్లి పోలీసులు కూడా తెలిపానని ప్రమాణపత్రంలో పద్మావతి తెలిపింది.

అయితే, అలా కోర‌గానే కేసును కొట్టేయ‌డం కుద‌ర‌ద‌ని హైకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్‌ వీఆర్‌కే కృపాసాగ‌ర్ తెలిపారు. త‌ప్పుడు ఫిర్యాదు చేసిన‌ట్లు తేలితే ఫిర్యాదుదారు కూడా తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుంద‌ని హెచ్చ‌రించారు. అలాగే కేసు వివ‌రాల‌ను త‌మ ముందు ఉంచాల‌ని న్యాయ‌స్థానం పోలీసుల‌ను ఆదేశించింది. విచార‌ణ‌ను ఈ నెల 12కి వాయిదా వేసింది.

మేరుగు త‌ర‌ఫు న్యాయ‌వాది దుశ్యంత్‌రెడ్డి స్పందిస్తూ.. త‌దుప‌రి విచార‌ణ వ‌రకు అరెస్టు నుండి ర‌క్ష‌ణ క‌ల్పిస్తూ మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు ఇవ్వాల‌ని కోర‌గా, న్యాయ‌మూర్తి తోసిపుచ్చారు. కాగా, కాంట్రాక్టు ప‌నుల పేరిట త‌న‌ నుంచి భారీ మొత్తంలో న‌గ‌దు తీసుకోవ‌డంతో పాటు త‌న‌పై లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డ్డార‌ని వైసీపీ నేత మేరుగు నాగార్జునపై విజ‌య‌వాడ‌కు చెందిన ఓ మ‌హిళ తాడేప‌ల్లి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు మాజీ మంత్రి మేరుగుపై అత్యాచారం కేసు న‌మోదు చేశారు.

ఈ కేసును కొట్టేయాల‌ని కోరుతూ ఈ నెల 5న నాగార్జున‌, ఆయ‌న పీఏ ముర‌ళీమోహ‌న్ రెడ్డి హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. బుధ‌వారం ఈ పిటిష‌న్ విచార‌ణ‌కు వచ్చింది. అయితే, ఫిర్యాదుదారు న్యాయ‌స్థానంలో హాజ‌రై తాను త‌ప్పుడు ఫిర్యాదు చేశాన‌ని, కేసు కొట్టేయాలంటూ ప్ర‌మాణ‌ప‌త్రం దాఖ‌లు చేశారు. దీనిపై న్యాయస్థానం స్పందిస్తూ నిందితుడు ప్రజాప్రతినిధి లేదా అనే ప్రాతిపదికన మూసివేత ఉత్తర్వులు ఇవ్వలేము. అత్యాచారం ఫిర్యాదులను కోర్టుల్లో దాఖలు చేయడం, వాటిని ఉపసంహరించుకోవడం వంటి సంఘటనలు తరచుగా జరుగుతున్నాయని గమనించిన జస్టిస్ కృపా సాగర్, తప్పుడు ఫిర్యాదులకు ఫిర్యాదుదారులు కూడా పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. కేసు డైరీని, దర్యాప్తుపై స్టేటస్ రిపోర్టును సమర్పించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.