Former Andhra Minister Merugu Nagarjuna Booked In Sexual Harassment Case

Vjy, Nov 2: వైసిపి మాజీమంత్రి మేరుగ నాగార్జునపై తాడేపల్లి పోలీస్ స్టేషన్లో బలుకూరి పద్మావతి అనే మహిళ ఫిర్యాదు చేసింది. తనను శారీరకంగా ఆర్థికంగా మోసం చేశారంటూ మేరుగ నాగార్జున పై సీఐ కళ్యాణ్ రాజుకు లిఖితపూర్వకంగా మహిళ ఫిర్యాదు చేసింది. కాంట్రాక్టు ఉద్యోగం ఇప్పిస్తానంటూ శారీరకంగా లోబరుచుకొ‌ని, 90 లక్షలు రూపాయలు తీసుకుని ఆర్థికంగా మోసం చేశాడంటూ మాజీ మంత్రి నాగార్జున పై బాధితురాలు ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలని కోరుతూ తాడేపల్లి పోలీసులను మహిళ ఆశ్రయించింది. తనకు ప్రాణహాని ఉందంటూ పోలీసుల ఎదుట బాధితురాలు వాపోయింది.

వ్యక్తిగత గోప్యత భార్యాభర్తలకూ వర్తిస్తుంది.. ఒకరిపై ఒకరు నిఘా పెట్టకూడదు.. భార్యకు తెలియకుండా ఆమె కాల్ రికార్డ్స్ చెల్లవు.. మద్రాస్‌ హైకోర్టు కీలక తీర్పు

లైంగికదాడి ఆరోపణలపై వైసీపీ మాజీ మంత్రి మెరుగు నాగార్జున స్పందించారు. తనపై తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన మహిళ ఎవరో తనకు తెలియదన్నారు. ఆమెతో తనకు ఎలాంటి సంబంధం లేదని, దీనిపైన పూర్తిస్థాయిలో విచారణ జరగాల్సివుందన్నారు. ఈ మేరకు నాగార్జున మాట్లాడుతూ.. ‘నేను కూడా ఎస్పీని కలిసి ఈ అంశంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని కోరతాను. ఆమెను నేను శారీరకంగా వాడుకున్నానని, డబ్బులు తీసుకున్నానని చెబుతోంది. విచారణలో ఇదే నిజమని తెలితే నాకు ఉరిశిక్ష వేయండి.

Sexual Allegations on Merugu Nagarjuna

నేను ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నాను. ఏ టెస్టులకైనా సిద్ధం. నేను మంత్రిగా ఉన్నప్పుడు అనేకమంది నా దగ్గరికి వస్తూ పోతూ ఉంటారు. ఈ వ్యవహారం వెనుక కుట్ర దాగి ఉంది. విచారణలో ఈ కుట్ర వెనుక ఎవరెవరు ఉన్నారో కచ్చితంగా బయటపడుతుంది. నేను పార్టీలో యాక్టివ్ గా ఉన్నానన్న కారణంతోనే కొంతమంది నా పైన కుట్ర చేస్తున్నారు. రాజకీయంగా నాతో శత్రుత్వం ఉంటే నన్ను చంపండి. కానీ ఇలాంటి దుర్మార్గపు కుట్రలకు తెర తీయొద్దు’ అని కోరారు.