Anitha vs Vijaysai Reddy: వచ్చే ఎన్నికల్లో మీకు ఆ 11 సీట్లు కూడా రావు, విజయసాయి రెడ్డిని వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన ఏపీ హోం మంత్రి అనిత
స్థాయి, వయసు మరిచిపోయి చిల్లరగా మాట్లాడుతున్నారని విమర్శించారు.
Vjy, Dec 9: చేసిన తప్పులు బయటపడుతున్నాయనే భయంతో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. స్థాయి, వయసు మరిచిపోయి చిల్లరగా మాట్లాడుతున్నారని విమర్శించారు. సోమవారం విజయవాడ (Vijayawada)లోని సబ్‌జైల్‌ను ఆమె పరిశీలించారు. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి రావడం జరిగిందని, మౌలిక వసతులపై ఆరా తీశామని, జైలులో అధికారులపై వస్తున్న ఆరోపణలపై తనిఖీ చేయడం జరిగిందని ఆమె అన్నారు.
ఆమె మాట్లాడుతూ.. చంద్రబాబును విమర్శించినా... తమకు, పవన్ కల్యాణ్ కు మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నించినా విజయసాయిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. పద్ధతిగా మాట్లాడాలని హితవు పలికారు. తనపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేసుకోవాలని విజయసాయి ధైర్యంగా చెప్పాలని అనిత అన్నారు. ఆయనపై కచ్చితంగా కేసులు నమోదు చేస్తామని చెప్పారు.
రేషన్ బియ్యం అక్రమాలపై కూడా విచారణ జరుగుతోందని... నిందితులను వదిలిపెట్టబోమని చెప్పారు. వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లో ఆ 11 సీట్లు కూడా రావని అన్నారు.విజయసాయి ఎన్ని రకాలుగా సీఎం చంద్రబాబును తిట్టినా.. బురద జల్లినా.. పవన్ కల్యాణ్‌కు.. తమకు మధ్య చిచ్చుపెట్టాలని ప్రయత్నించినా.. ఏం చేసినా.. ‘నిన్ను మాత్రం వదిలిపెట్టేదిలేదని’ హోంమంత్రి హెచ్చరించారు.
విజయవాడ జైల్లో పరిస్థితులను తెలుసుకోవడానికి వచ్చానని చెప్పారు. జైల్లో మౌలిక వసతులపై ఆరా తీయడం జరిగిందని తెలిపారు. జైలు అధికారులపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరుగుతోందని, రెండు రోజుల్లో నివేదిక వస్తుందని, నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆరోపణలపై సమాధానం చెప్పాలి తప్ప వ్యక్తిగత విమర్శలు చేయడం మంచిదికాదన్నారు. అధికారులను బెదిరించి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వ్యవస్థలను భ్రష్టు పట్టించిందని విమర్శించారు. పార్టీలకు పోలీసులు తొత్తులుగా మారితే చర్యలు తప్పవని, పోలీసులు ప్రజలకు సేవలు అందించాలని.. పోలీసులు ఎక్కడైనా ఏకపక్షంగా వ్యవహరించారని తేలితే వారిపై చర్యలు తప్పవని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు.