Pawan Kalyan on Volunteers: గత ప్రభుత్వంలో వాలంటీరు ఉద్యోగాలే లేవు, పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు, జగన్ వారిని దారుణంగా మోసం చేశారని వెల్లడి

వాలంటీర్ల వ్యవస్థకు తాము వ్యతిరేకం కాదని, తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు రూ.10 వేల వేతనం ఇస్తామని కూడా హామీ ఇచ్చింది. అదే సమయంలో... పెద్ద సంఖ్యలో వాలంటీర్లు రాజీనామాలు చేశారు.

Pawan Kalyan Purchases 12 Acres In Pithapuram(X)

Vjy, Nov 7: గత ఎన్నికల సమయంలో కూటమి... వాలంటీర్ల వ్యవస్థకు తాము వ్యతిరేకం కాదని, తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు రూ.10 వేల వేతనం ఇస్తామని కూడా హామీ ఇచ్చింది. అదే సమయంలో... పెద్ద సంఖ్యలో వాలంటీర్లు రాజీనామాలు చేశారు. వైసీపీ నేతల ఒత్తిళ్ల కారణంగానే వారు రాజీనామాలు చేసినట్టు కథనాలు వచ్చాయి.

తాజాగా వాలంటీర్లపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లను కొనసాగిస్తామని కూటమి చెప్పినప్పటికీ, సాంకేతిక అంశాలు ఆటంకంగా మారాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెబుతున్నారు. ఇవాళ సర్పంచ్ సంఘాల సమావేశానికి పవన్ హాజరయ్యారు.

అధికారంలోకి వచ్చాక ఏ పోలీసును వదలం, సప్త సముద్రాల అవతల ఉన్నా వెతికి మరీ పట్టుకుంటాం, వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వాలంటీర్లను వైసీపీ దారుణంగా మోసం చేసి నియమించుకుందని ఆరోపించారు. వాలంటీర్లకు ఇచ్చిన మాట నెరవేర్చుదామని భావిస్తుంటే, గత ప్రభుత్వం ఇచ్చిన జీవోలో ఎక్కడా వాలంటీర్ల ప్రస్తావనే లేదని పవన్ స్పష్టం చేశారు. అసలు, దాంట్లో వాలంటీరు ఉద్యోగాలే లేవని అన్నారు. ఇదొక సాంకేతిక సమస్యగా మారిందని విచారం వ్యక్తం చేశారు.

"గ్రామ వాలంటీర్లు, సచివాలయాలు పంచాయతీలకు సమాంతర వ్యవస్థలా తయారయ్యాయన్న అభిప్రాయం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులంతా ముక్తకంఠంతో చెబుతున్నారు. వాలంటీర్ వ్యవస్థ వేరు. సచివాలయ వ్యవస్థ వేరు. వాలంటీర్లకు మేలు చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. జీతాలు పెంచుదామంటే జీవోలో ఎక్కడా కనబడడం లేదు. గత ప్రభుత్వం వారిని మోసం చేసింది. వాళ్లు ఉద్యోగంలో ఉన్నట్లు రికార్డులు ఉంటే ఆ వ్యవస్థను రద్దు చేయవచ్చు. కానీ వాళ్లు అసలు వ్యవస్థలోనే లేరు. ఇదో సాంకేతిక సమస్య" అని వివరించారు.



సంబంధిత వార్తలు

CPI Narayana On Pushpa 2: అదో సినిమానా? స్మగ్లింగ్‌ ను గౌరవంగా చూపించే అలాంటి సినిమాకు మీరు రాయితీ ఇవ్వడమా? పుష్ప-2, తెలంగాణ ప్రభుత్వంపై సీపీఐ నారాయణ మండిపాటు

Andhra Pradesh Shocker: కొడుకును సుపారీ ఇచ్చి హత్య చేయించిన తండ్రి, కొడుకు వేధింపులు భరించలేక అడవిలోకి తీసుకెళ్లి మద్యం తాగించి హత్య...వీడియో

CM Revanth Reddy: సర్వమత సమ్మేళనంం తెలంగాణ, మత విద్వేషాలు రెచ్చగోడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన సీఎం రేవంత్ రెడ్డి, క్రిస్టియన్ల సంక్షేమం- అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామన్న సీఎం

AP Weather Update: ఏపీవాసులు ఊపిరిపీల్చుకునే కబురు.. బలహీనపడిన వాయుగుండం.. తప్పిన ముప్పు.. అయితే, రెండు రోజుల్లో బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు భారీ వర్ష సూచన

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif